AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7th Sense Movie: ‘7th సెన్స్’ సినిమాలో భయపెట్టిన ఈ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకవుతారు

సూర్య నటించిన సూపర్ హిట్ సినిమాల్లో 7th సెన్స్ ఒకటి. కోలీవుడ్ దర్శకుడు మురగదాస్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో హైలెట్ అంటే విలన్ డాంగ్లీ రోల్ అని చెప్పుకోవచ్చు.

7th Sense Movie: '7th సెన్స్' సినిమాలో భయపెట్టిన ఈ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే షాకవుతారు
7th Sense Movie Actor
Basha Shek
|

Updated on: Oct 26, 2025 | 2:48 PM

Share

2017లో సూర్య నటించిన చిత్రం 7th సెన్స్. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం తమిళ్ లో కంటే తెలుగులోనే సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాకు హారీస్ జయరాజ్ పాటలు అందించారు. 7th సెన్స్ సనిమాలో హీరో సూర్య రెండు పాత్రలు పోషించాడం విశేషం. బోధి ధర్ముడిగా, అరవింద్ పాత్రల్లో ఒదిగిపోయాడు. ఇక హీరోయిన్ గా శ్రుతి హాసన్ ఆకట్టుకుంది.అలాగే ధన్య బాలకృష్ణన్, ఇళవరసు, అభినయ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో విలన్ రోల్ నెవర్ బిపోర్‌ అని చెప్పవచ్చు. పెద్దగా డైలాగులు చెప్పకపోయినా తన ఎక్స్ ప్రెషన్స్ తోనే అందరినీ భయపెట్టాడు డాంగ్లీ. చాలా సీన్స్ లో సూర్య తో పోటా పోటీగా నటించాడు. ఇప్పటికీ టీవీల్లో 7th సినిమా వస్తుందంటే డాంగ్లీ రోల్ కోసమే చూస్తుంటారు చాలా మంది.

తన నటనతో భయపెట్టిన డాంగ్లీ అసలు పేరు జానీ ట్రై గుయెన్. మార్షన్ అర్ట్స్ లో మేటి అయిన అతను ప్రముఖ స్టంట్ మాస్టర్ కూడా. స్పైడర్ మ్యాన్ 2 లాంటి హాలీవుడ్ సినిమాలకు స్టంట్ మ్యాన్‌గా పని చేశాడు. 2007లో రిలీజైన రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జానీ. బాబీ చాయ్‌గా ఓ మంచి రోల్‌ చేశాడు. దీని తర్వాత ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాలో కూడా మెరిశాడు. బిజినెస్ మ్యాన్, బ్రూస్‌లీ, ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ దాదాపు తెలుగులో ఐదారు సినిమాల్లో యాక్ట్ చేశాడు జానీ. కానీ 7th సెన్స్ లో పోషించిన డాంగ్లీ రోల్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి

డాంగ్లీ లేటెస్ట్ లుక్..

7th సెన్స్ మూవీ రిలీజై ఇప్పటికీ 14 ఏళ్లు పూర్తి కావోస్తోంది. అయితే ఇప్పుడు ఈ నటుడికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ఇప్పుడు అసలు గుర్తు పట్టని విధంగా మారిపోయాడు డాంగ్లీ. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. డాంగ్లా మావా ఏంటిలా మారిపోయావు? మళ్లీ తెలుగు సినిమాలో ఎప్పుడు నటిస్తావు? అని ప్రశ్నలు అడుగు తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.