AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Adi Reddy: ఆదిరెడ్డి రెండో కూతురి బారసాల వేడుక.. ఏం పేరు పెట్టారో తెలుసా? ఫొటోస్ ఇదిగో

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి ఇటీవలే రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఆగస్టు 05న అతని సతీమణి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ కూతురికి బారసాల వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు ఆదిరెడ్డి దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టిం వైరలవుతున్నాయి.

Basha Shek
|

Updated on: Oct 24, 2025 | 10:51 PM

Share
 బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, యూట్యూబర్ గా, రివ్యూయర్ గా..ఇలా తెలుగు రాష్ట్రాల్లో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో కామన్ మ్యాన్ కోటాలో ఎంట్రీ  ఇచ్చాడు ఆది రెడ్డి.

1 / 5
 బిగ్ బాస్ టైటిల్ గెలవకపోయినా తన ఆట, మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఆది రెడ్డి.

2 / 5
  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నాడు ఆది రెడ్డి. అందులో బిగ్ బాస్ తో పాటు  సినిమాలపైనా రివ్యూలు ఇస్తున్నాడు. అలాగే కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు.

3 / 5
 2020లో కవిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆది రెడ్డి. ఇప్పటికే ఈ దంపతులకు అద్విత అనే అమ్మాయి ఉంది. కొన్ని నెలల క్రితం కవిత మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

4 / 5
 ఇప్పుడు తమ రెండో కూతురికి బారసాల వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు ఆది రెడ్డి దంపతులు. తమ గారాల పట్టికి నైరాశ్రీ అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

5 / 5