Health Tips: మీకూ ఈ సమస్యలు ఉన్నాయా?.. అయితే ఈ పండు జోలికి మాత్రం వెళ్లకండి..
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి సీతాఫలం అంటే ఎంతో ఇష్టం.. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం జనాలు ఎలా అయితే వేచిచూస్తారో.. సీతాకాలం వచ్చిందంటే ఈ పండ్ల కోసం అలానే వేచిచూస్తుంటారు. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ అందరికీ కాదు. కొన్ని సమస్యలు ఉన్న వ్యక్తులు ఈ పండ్లను అస్సలు తినొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ పండు ఎవరికి తగినవద్దు.. దాని దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం.
Updated on: Oct 25, 2025 | 4:43 PM

జీర్ణ సమస్యలు ఉన్నవారు: సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి, దానిని ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు లేదా కడుపు నిండిన భావన వంటి కలుగు తుంది. ఇవి జీర్ణ సమస్యలను మరింత పెంచుతాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు సీతాఫలాలకు దూరంగా ఉండండి

విషపూరిత విత్తనాల ప్రమాదం: సీతాఫలం యొక్క పొట్టి గుజ్జు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దాని విత్తనాలు విషపూరితమైనవి. అందువల్ల, పండ్లను తినేటప్పుడు, విత్తనాలను తొలగించి, వాటిని మింగకుండా జాగ్రత్త వహించండి. పొరపాటున నమిలి మింగితే ఆరోగ్య సమస్యల బారిన పడవచ్చు.

అధిక ఐరన్ సమస్యలు ఉన్నవారు: సీతాఫలం ఇనుముకు మంచి మూలం. అయితే, అధికంగా తీసుకుంటే, అది శరీరంలో ఇనుము స్థాయిలను పెంచుతుంది. దీని కారణంగా కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, కడుపు పొర వాపు , పూతల వంటి సమస్యల రావచ్చు

అలెర్జీలు ఉన్నవారు: కొంతమందికి సీతాఫలం తిన్న తర్వాత దురద, దద్దుర్లు, చికాకు లేదా ఇతర అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి లక్షణాలు కనిపిస్తే, సీతాఫలం తినకుండా ఉండటం మంచిది.

Note: పైన పేర్కొన్న అంశాలు పోషకాహార నిపుణుల, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించినవి కాబట్టి.. వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచింది.




