తాటిబెల్లం ఏయే వ్యాధులను నయం చేస్తుందో తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!
సాధారణ బెల్లం అందరికీ తెలుసు.. కానీ, తాటి బెల్లం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ, ఇందులోని పోషకాలు మాత్రం చాలా ఎక్కువని కొందరికీ మాత్రమే తెలుసు. తాటి బెల్లం పుష్కలమైన పోషక విలువలు కలిగి ఉంటుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆడవారికి ఇది అమృతంతో సమానం అంటున్నారు. మహిళల్లో ఎక్కువగా ఎదురయ్యే నెలసరి సమస్యలు సహా పలురకాల అనారోగ్యాలను దూరం చేసి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుందని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Oct 25, 2025 | 4:17 PM

తాటి బెల్లం జీర్ణ సమస్యలకు చక్కగా ఉపయోగపడుతుంది. తాటి బెల్లంలోని పీచు పదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. తాటి బెల్లంను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

ఇందులోని ఇనుము, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులను పెంచుతాయి. దీంతో రక్తహీనత ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఎక్కువ మోతాదులో ఉండే కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. తాటి బెల్లంలో ఉండే పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

తాటి బెల్లంలో ఐరన్, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. తాటి బెల్లం తరచూ తీసుకోవటం వల్ల కాల్షియం, పొటాషియం పెరిగి ఎముకలు బలంగా తయారవుతాయి. నెలసరి, అధిక బరువు సమస్యలకు కూడా తాటి బెల్లం సహాయపడుతుంది. చక్కెరతో పోలిస్తే తాటిబెల్లంలో ఖనిజ లవణాలు 60 శాతం ఎక్కువ. టీ, కాపీ, పండ్ల రసాలలో తాటి బెల్లాన్ని వినియోగించవచ్చు.

పొడిదగ్గు , జలుబు వంటివాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మాన్ని తొలగించి వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. ఆస్తమా బాధితులకు చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు..ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. తాటి బెల్లం శరీరాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.

నెలసరి, అధిక బరువు సమస్యలకు తాటిబెల్లం చెక్ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నవారు నోట్లో చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది. వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లబరుస్తుంది. తాటి బెల్లంలో శక్తినిచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.




