- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Heroine Played Daughter and Girl Friend Roles With Venkatesh, She Is Sridevi
Venkatesh: వెంకటేశ్‌కు కూతురిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ? అస్సలు ఊహించలేరు..
తెలుగు సినిమా ప్రపంచంలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోయిన్లుగా మారిన తారలు చాలా మంది ఉన్నారు. అయితే చిన్నప్పుడు నటించిన అదే హీరోలతో మళ్లీ హీరోయిన్లుగా నటించినవారు ఉన్నారు. ప్రస్తుతం తెలుగులో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులుగా హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. విక్టరీ వెంకటేశ్ కూతురిగా కనిపించిన ఓ హీరోయిన్.. అదే హీరోతో జతకట్టింది. ఇంతకీ ఆమె ఎవరంటే..
Updated on: Oct 26, 2025 | 2:49 PM

విక్టరీ వెంకటేశ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ అడియన్స్ లో వెంకీకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా.. ఇందులో వెంకీ జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. అలాగే చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న మన శంకరవర ప్రసాద్ గారు సినిమాలోనూ వెంకీ కీలకపాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే వెంకీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

అయితే మీకు ఒక విషయం తెలుసా.. ? వెంకీకి కూతురిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో.. ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కథానాయికగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఆమె మరెవరో కాదండి.. దివంగత హీరోయిన్ శ్రీదేవి. 1971లో అక్కినేని నాగేశ్వరరావు, వాణి శ్రీ జంటగా నటించిన సినిమా ప్రేమనగర్. ఈ సినిమాను తమిళంలో వసంత మాళిగై పేరుతో రీమేక్ చేయగా.. శివాజీ గణేశన్ హీరోగా నటించారు. ఇక ఆయన సోదరుడి పాత్రలో విజయ్ నటించారు. ఈ చిత్రంలో విజయ్ కు తమ్ముడి పాత్రలో చైల్డ్ ఆర్టిస్టుగా వెంకటేశ్ నటించారు.

ఇక ఇదే సినిమాలో విజయ్ కు కూతురిగా శ్రీదేవి నటించింది. అంటే.. ఈ సినిమాలు విజయ్ కూతురిగా శ్రీదేవి కనిపించగా.. ఆయన తమ్ముడిగా వెంకీ నటించారు. అంటే ఇందులో శ్రీదేవికి వెంకటేశ్ బాబాయ్ అవుతారు. ఆ తర్వాత 19 ఏళ్లకు 1991లో విడుదలైన క్షణక్షణం సినిమాలో ఇద్దరు జంటగా నటించారు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.




