- Telugu News Photo Gallery Cinema photos Young heroine shraddha srinath shared her latest cute photos
రంగుల చిలక.. అదరగొట్టిన శ్రద్దా శ్రీనాద్..! ఎంత వయ్యారంగా ఉందో
ఇటీవలే కలియుగం 2064 అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
Updated on: Oct 25, 2025 | 9:13 PM

ఇటీవలే కలియుగం 2064 అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

మొదటి సినిమాతోనే తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతకు ముందు 2015లో మలయాళంలో వచ్చిన కోహినూర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. నటనతో ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది.

ఆ తర్వాత ముంగారు మేల్ 2, ఉర్వి, కాట్రు వెళియదై, ఇవన్ తంతిరాన్, విక్రమ్ వేద, రిచి, కృష్ణ అండ్ హిజ్ లీలా, డాకు మహారాజ్ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది.

అయితే ఇన్నాళ్లు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచేసింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఖాతాలో వరుసగా గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తుంది. కేక పెట్టించే అందాలతో కుర్రకారు మనసులు కొల్లగొట్టేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇండస్ట్రీలో సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా చీరకట్టులో మెప్పించింది. ఓ వైపు చీరకట్టులో అలరిస్తూనే.. మరో వైపు వలపులతో కవ్విస్తుంది. ఈ ఫోటోలకు కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




