Actress Lakshmi: వందలాది సినిమాలు చేసిన ఈ నటి గుర్తుందా? ఆమె కూతురు కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే?
ఇప్పుడంటే అమ్మమ్మ, అమ్మ పాత్రలు చేస్తుంది లక్ష్మీ ఒకప్పుడు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తన అందం, అభినయానికి లెక్కలేనన్నీ అవార్డులు, ప్రశంసలు అందుకుంది. అయితే ఈ నటి హీరోయిన్ కూడా ఫేమస్ హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు.

నటి లక్ష్మి గురించి ఈ జనరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చు. ప్రస్తుతం అమ్మమ్మ, అమ్మ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. మురారి, మిథునం, ప్రేమించు, లాహిరి లాహిరి లాహిరిలో, చింతకాయల రవి, మిథునం, ఓ బేబి, గ్యాంగ్ లీడర్, ఖుషి వంటి సినిమాల్లో ఆమె సహాయక నటిగా మెప్పించింది. అయితే ఇప్పుడంటే ఆమె ఇలాంటి పాత్రలు పోషిస్తుంది కానీ ఒకప్పుడు తెలుగు నాట స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది లక్ష్మి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు తదితర స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది. వందలాది సినిమాల్లో నటించిన లక్ష్మి తన అభినయ ప్రతిభకు ప్రతీకగా నంది, ఫిల్మ్ ఫేర్ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు గెల్చుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్ అయిన లక్ష్మీ పర్సనల్ లైఫ్ లో మాత్రం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది. మూడు సార్లు వివాహం చేసుకుంది. ఈ సంగతి పక్కన పెడితే లక్ష్మీ కూతురు దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది. ఆమె మరెవరో కాదు ఐశ్వర్య భాస్కరన్.
పేరె చెబితే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో రవితేజ పిన్నిగా యాక్ట్ చేసింది లక్ష్మీ కూతురే. అయితే తల్లి లాగే ఐశ్వర్య కూడా కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. జగపతి బాబు అడవిలో అభిమన్యుడు, మామగారు , ప్రేమ జిందాబాద్, రాజేంద్ర ప్రసాద్‌తో సుబ్బారాయుడు, పెళ్లంటే నూరేళ్ల పంట, సీతాపతి చలో తిరుపతి, బ్రహ్మ వంటి సినిమాల్లో కథానాయికగా నటించింది.
ఐశ్వర్య లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత పలు సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది. అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయి, మహేష్ బాబు నాని, ధైర్యం, శ్రీ మహాలక్ష్మి, ఝుమ్మంది నాదం, భలే మంచి రోజు, ఓ బేబీ, దేవదాస్ లేటెస్ట్ గా కన్నప్ప సినిమాలో యాక్ట్ చేసింది ఐశ్వర్య. అయితే తల్లిలాగే ఐశ్వర్య కూడా వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంది. భర్త నుంచి విడాకులు తీసుకుని తన కుమార్తెతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.
కన్నప్ప సినిమాలో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








