Tollywood: నాలుగు సార్లు ఐవీఎఫ్.. విడాకుల బాటలో టాలీవుడ్ హీరోయిన్! 14 ఏళ్ల వైవాహిక బంధానికి కటీఫ్!
మరో టాలీవుడ్ హీరోయిన్ తన భర్తతో విడాకులు తీసుకోనుందా? ఇప్పటికే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తులు చేశారా? ముగ్గురు పిల్లలను కూడా పంచుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఈ సెలబ్రిటీ జంట విడాకుల గురించే చర్చ జరుగుతోంది.

కారణాలేవైనా గానీ సినిమా ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణమైపోయాయి. మూడుముళ్ల బంధం కేవలం మూణ్ణాళ్ల ముచ్చటగానే మారిపోతుంది. ఎన్నో ఏళ్ల పాటు కాపురం చేసి, పిల్లల్ని కని ఆదర్శంగా కనిపించిన జంటలు కూడా అనూహ్యంగా విడిపోతున్నాయి. విడాకుల కోసం కోర్లు మెట్లెక్కుతున్నాయి. ఇప్పుడు మరో సెలబ్రిటీ జంట విడాకులు తీసుకోనున్నారంటూ ఇటు సోషల్ మీడియా, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్లు కలిసి కాపురం చేశారు. ఒకరి కష్ట సుఖాలను మరొకరు పంచుకున్నారు. ముగ్గురు పిల్లలకు అమ్మానాన్నలయ్యారు. తమ దాంపత్య బంధంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అయితే ఇప్పుడీ బంధం పెటాకులుకానుంది. త్వరలోనే ఈ ఆదర్శ దంపతులు విడిపోనున్నారు. ఇప్పటికే విడాకుల కోసం దరఖాస్తు కూడా చేశారని టాక్. వారు మరెవరో కాదు జే భానుషాలి – మహి విజ్. ఈ పేర్లు తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. హిందీ సినిమాలు, సిరీయల్స్ చూసేవారికి ఈ సెలబ్రిటీ జంట గురించి తెలిసే ఉంటుంది. ఇక నటి మహి విజ్ గతంలో దక్షిణాదిలో పలు సినిమాల్లో నటించింది. 2004లో రిలీజైన తెలుగు మూవీ తపనలోనూ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. కన్నడ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసింది. అయితే బాలీవుడ్ లోనే సెటిలైపోయింది.
జే భానుషాలి, మహి విజ్ లది ప్రేమ వివాహం. 2011లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహమైన తర్వాత చాలా ఏళ్లవరకు వీరికి సంతానం కలగలేదు. దీంతో ఐవీఎఫ్ కు ప్రయత్నించారు. కానీ మూడు సార్లు ఈ ప్రయత్నం విఫలమైంది. దీంతో 2017లో జే భానుషాలి, మహి విజ్ రాజ్‌వీర్, ఖుషిలను దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత 2019లో మరోసారి ఐవీఎఫ్ ద్వారా కూతురు తార జన్మనిచ్చారు. అయితే ఇప్పుడీ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.
మహి విజ్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
జే భానుషాలి, మహి విజ్ తమ 14 ఏళ్ల దాంపత్యానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ మేరకు కొద్ది నెలల క్రితమే విడాకులకు దరఖాస్తు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పరస్పరం అనుమతితో విడాకులు తీసుకుంటోన్న జే భానుశాలి, మహి విజ్ తమ ముగ్గురు పిల్లల బాధ్యతలను కూడా పంచుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








