Bigg Boss Telugu 9: రమ్య మోక్ష ఎలిమినేషన్‌కు కారణాలివే.. బిగ్‌బాస్ ద్వారా పచ్చళ్ల పాప ఎంత సంపాదించిందంటే?
వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో కి ఎంట్రీ ఇచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష రెండో వారానికే బయటకు వచ్చింది. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఈ పచ్చళ్ల పాపకు రెమ్యునరేషన్ గట్టిగానే అందిందని సమాచారం.

అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ పచ్చళ్ల వ్యాపారంతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది రమ్య మోక్ష. అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. వైల్డ్ కార్డ్ ద్వారా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. రమ్య బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు చాలా రోజులు ఈ రియాలిటీ షోలో ఉంటుందని భావించారు చాలా మంది. కానీ అదేమీ జరగలేదు. తన నోటి దురుసు, దుందుడుకు స్వభావంతో అనవరసరంగా నెగెటివిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా టాప్ కంటెస్టెంట్స్ తనూజ, కల్యాణ్ లను టార్గెట్ చేసింది. వారిపై పర్సనల్ అటాక్స్ చేసింది. తనూజను ఫేక్ పిల్ల అని తిట్టిన రమ్య కల్యాణ్ ను అమ్మాయిల పిచ్చోడు అని ముద్ర వేసేసింది. దీనిపై నాగార్జున కూడా సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత వీకెండ్ ఎపిసోడ్ లో హైపర్ ఆది కూడా రమ్యకు కొన్ని మంచి టిప్స్ ఇచ్చాడు. కానీ వీటిని కూడా నెగెటివ్ గా తీసుకుంది సోషల్ మీడియా సెన్సేషన్. ఈ కారణంగానే ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటినప్పటికీ ఆడియెన్స్ ఓటింగ్ లో వెనకపడిపోయింది పచ్చళ్ల పాప. నామినేషన్స్ లో నిలిచి రెండో వారమే ఎలిమినేట్ అయ్యింది.
మొత్తానికి బిగ్ బాస్ కు రాక ముందు సోషల్ మీడియాలో చాలా నెగెటివిటీని మూటగట్టుకుంది రమ్య మోక్ష. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు తన ఆటతీరుతో దానిని మార్చేసుకుంటుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. పైగా మరిన్ని విమర్శలను, నెగెటివిటీని మూట గట్టుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ ద్వారా రమ్యకు భారీగానే రెమ్యునరేషన్ అందిందని సమచారం. ఆమెకు వారానికి సుమారు రూ.1.50 -2 లక్షల మేర పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రెండువారాలకు గానూ రమ్య మోక్ష దాదాపు రూ.4 లక్షల మేర అందుకున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ లో రమ్య మోక్ష జర్నీ ఇదిగో..<
View this post on Instagram
/h3>
రమ్యకు గట్టిగానే బిగ్ బాస్ రెమ్యునరేషన్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








