AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. మోస్ట్ డిస్టర్బింగ్ సిరీస్.. గుండె ధైర్యముంటేనే చూడండి

ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల సందడి మొదలైంది. సాధారణంగా గురు, శుక్రవారాల్లో ఎక్కువగా కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తాయి. అయితే సోమవారమే (అక్టోబర్ 27) ఒక హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. మోస్ట్ డిస్టర్బింగ్ సిరీస్.. గుండె ధైర్యముంటేనే చూడండి
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 27, 2025 | 10:12 PM

Share

ఇప్పుడు ఓటీటీలో క్రైమ్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, సిరీస లదే హవా. భాషతో సంబంధం లేకుండా ఏ లాంగ్వేజ్ లో వచ్చినా ఈ జానర్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీ ఆడియెన్స్ అయితే ఎగబడి ఈ సినిమాలను చూస్తున్నారు. అలా ఈ హారర్ మూవీ లవర్స్ కోసం సోమవారమే (అక్టోబర్ 27) ఒక హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. గతంలో వచ్చిన ఓ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ కు ఇది సీక్వెల్. ఓటీటీ ఆడియెన్స్ ఎప్పటి నుంచో ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సోమవారం వీరి నిరీక్షణకు తెరపడింది. అమెరికన్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ సిరీస్ లలో ‘ఇట్’ ఒకటి. ఈ సిరీస్ లో ఫస్ట్ మూవీ ‘ఇట్’ 2017లో రిలీజై సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా 2019లో ‘ఇట్ చాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడీ సిరీస్ లో మూడో భాగం ‘ఇట్‌:వెల్‌క‌మ్ టు డెర్రీ సిరీస్’ వచ్చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లున్నాయి. సోమవారం జియోహాట్‌స్టార్‌లో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఈ సిరీస్ లో రెండో ఎపిసోడ్ అక్టోబర్ 31న స్ట్రీమింగ్ కానుంది. మూడో ఎపిసోడ్ నవంబర్ 9న, నాలుగో ఎపిసోడ్ నవంబర్ 16న, అయిదో ఎపిసోడ్ నవంబర్ 23న, ఆరో ఎపిసోడ్ నవంబర్ 30న, ఏడో ఎపిసోడ్ డిసెంబర్ 7న, ఎనిమిదో ఎపిసోడ్ డిసెంబర్ 14న ఓటీటీలోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి

స్టీఫెన్ కింగ్ 1986లో రాసిన నవల ‘ఇట్’ ఆధారంగా ఇట్ సినిమాలు, సిరీస్ రూపొందుతున్నాయి. ఆండీ ముషీటి, బర్బరా ముషీటి, జేసన్ ఈ సిరీస్ లను తెరకెక్కిస్తున్నారు. టేలర్, జోవన్, బ్లేక్ కామెరాన్, క్రిస్, జేమ్స్, స్టీఫెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మంచి హారర్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇట్ వెల్కమ్ టు డెర్రీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. అయితే ఇందులో చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి. కాబట్ట పిల్లలతో చూడకపోవడమే ఉత్తమం..

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఎవరు అర్హులు..
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఎవరు అర్హులు..
నిర్భయ నిధి కింద 'ములుగు' జిల్లా ఎంపిక..!
నిర్భయ నిధి కింద 'ములుగు' జిల్లా ఎంపిక..!
ఉగాది స్పెషల్.. తప్పక చేసుకోవాల్సిన నాలుగు రకాల వంటకాలు ఇవే!
ఉగాది స్పెషల్.. తప్పక చేసుకోవాల్సిన నాలుగు రకాల వంటకాలు ఇవే!
హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!
హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!
హాయిగా..జాలీగా..వేసవిలో తప్పక సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలుఇవే
హాయిగా..జాలీగా..వేసవిలో తప్పక సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలుఇవే
సింపుల్.. ఈ లక్షణాలు కనిపిస్తే మీలో కాల్షియం లోపం ఉన్నట్లే..
సింపుల్.. ఈ లక్షణాలు కనిపిస్తే మీలో కాల్షియం లోపం ఉన్నట్లే..
ఉత్తర కొరియా చేసిన పనికి ఉలిక్కిపడ్డ దక్షణ కొరియా, జపాన్!
ఉత్తర కొరియా చేసిన పనికి ఉలిక్కిపడ్డ దక్షణ కొరియా, జపాన్!
ఎంత కష్టం చిన్నా.. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలి...
ఎంత కష్టం చిన్నా.. నువ్వు జీవితంలో గొప్పగా ఎదగాలి...
జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్
జింబాబ్వే స్టార్ పేసర్ దెబ్బకు పాక్ క్రికెట్ బోర్డ్ మైండ్ బ్లాక్
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్
వాట్సాప్‌లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఓపీ స్లిప్... క్యూలైన్లకు చెక్