AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇంటర్నేషన్ అవార్డులతో సంచలనం.. ఓటీటీలో బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

టీజర్ తోనే ఈ మూవీ సంచలనం రేకెత్తించింది. ఇందులోని కొన్ని సన్నివేశాలు సమాజంలో ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఇక రిలీజ్ కు ముందు సెన్సార్ బోర్డ్ కూడా ఈ సినిమాకు షాక్ ఇచ్చింది. అభ్యంతరకరమైన సన్నివేశాలకు కత్తెర్లు వేసింది.

OTT Movie: ఇంటర్నేషన్ అవార్డులతో సంచలనం.. ఓటీటీలో బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Oct 28, 2025 | 6:12 PM

Share

ఈ ఏడాది అత్యంత వివాదాస్పదమైన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. టీజర్ రిలీజ్ తోనే ఈ సినిమా వివాదాన్ని రేపింది. సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, యువతను పెడదోవ పట్టించేలా ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. పైగా ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ డైరెక్టర్స్ గా పేరున్న ఇద్దరు దర్శకులు ఈ సినిమాను నిర్మించడం గమనార్హం. అసలు ఇలాంటి దర్శకుల నుంచి ఇలాంటి బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక రిలీజ్ కు ముందు సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు షాక్ ఇచ్చింది. మూవీలోని అభ్యంతరకరమైన సన్నివేశాలకు కట్ చెప్పింది. దీంతో ఎలాగోలా థియేటర్లలో కి వచ్చిన ఈ బోల్డ్ మూవీ బాగానే ఆడింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ కాకపోయినా యువతకు బాగా నచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి రమ్య చాలా మంది లాగే తనకు ఓ బాయ్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటుంది. అలా స్కూల్ డేస్ లో ఒకరిని, కాలేజీలో ఉన్నప్పుడు మరొకరిని, ఉద్యోగం చేస్తూ ఇంకొకరిని లవ్ చేస్తుంది. అయితే కొన్ని కారణాలతో వీళ్లందరితోనూ బ్రేకప్ అయిపోతుంది. దీంతో ఒకానొక సందర్భంలో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితికి వెళ్తుంది. మరి ఈ పరిస్థితి నుంచి రమ్య ఎలా బయటపడింది? ఆమెపై బ్యాడ్ గర్ల్ అని సమాజం ఎందుకు ముద్ర వేసింది అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ పేరు బ్యాడ్ గర్ల్. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మించిన ఈ సినిమాకు వర్ష భరత్ దర్శకురాలిగా వ్యవహరించింది. ఆమెకు ఇదే మొదటి సినిమా. అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించగా, శరణ్య రవిచంద్రన్ తదితరులు నటించారు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బ్యాడ్ గర్ల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 4వ తేదీ నుంచి ఈ బోల్డ్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి

తెలుగులోనూ బ్ల్యాడ్ గర్ల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?