Jahnavi Swaroop: హీరోయిన్‌గా మహేష్ బాబు మేనకోడలు.. ఈ బ్యూటీ ఇప్పటికే ఓ సినిమాలో నటించిందని తెలుసా?
ఘట్టమనేని వంశం నుంచి మరొకరు సినిమా ఇండస్ట్రీలోకి రానున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని గారాల పట్టి జాన్వీ స్వరూప్ త్వరలోనే హీరోయిన్ గా కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా మంజులనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

సూపర్‌స్టార్ కృష్ణ మనవరాలు, ప్రిన్స్ మహేష్ బాబు మేనకోడలు, నటి-నిర్మాత మంజుల ఘట్టమనేని, నటుడు సంజయ్ స్వరూప్ దంపతుల కూతురు జాన్వీ స్వరూప్ సినీ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.ఇవాళ (అక్టోబర్ 29) జాన్వీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమె సినీ ప్రవేశం గురించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది మంజుల. జాన్వీ అందమైన ఫొటోలను షేర్ చేస్తూ .. ‘నా చిన్నారి జాన్వీ ఎంత వేగంగా ఎదిగిపోయిందో! ఇప్పుడు ఆమె రంగుల ప్రపంచమైన సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. జాన్వీకి మంచి మనసుతో పాటు అద్భుతమైన టాలెంట్ ఉంది. ఆమె ప్రతిభను ప్రపంచం త్వరలోనే చూడబోతోంది. నా డార్లింగ్… వెండితెర నీకోసం ఎదురుచూస్తోంది. ఐ లవ్యూ సో మచ్. హ్యాపీ బర్త్‌డే మై జాను’ అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మంజుల. దీంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, మహేష్ అభిమానులు జాన్వీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి ఆమెకు స్వాగతం పలుకుతూ కామెంట్స్ పెడుతున్నారు.
జా న్వీ మొదటి సినిమాకు సంబంధించిన కథ, డైరెక్టర్, ప్రొడక్షన్ బ్యానర్ ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. అయితే జాన్వీ స్వరూప్ కు యాక్టింగ్ కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆమె ఓ సినిమాలో నటించింది. 2018లో తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది జాన్వీ. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు జాన్వీ మేనమామ మహేష్ బాబు వాయిస్ ఓవర్ విశేషం. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
ట్రెడిషినల్ అండ్ ట్రెండీ దుస్తుల్లో జాన్వీ స్వరూప్..
View this post on Instagram
జాన్వీ తల్లిదండ్రులు ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. తల్లి మంజుల నటిగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాకుండా ‘మనసుకు నచ్చింది’ సినిమాతో డైరెక్టర్ గానూ మారింది. ఇక నిర్మాతగా ‘ఇందిరా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ‘పోకిరి’, ‘ఏ మాయ చేశావె’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించింది. ఇక తండ్రి సంజయ్ స్వరూప్ కూడా పలు చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి మంచి గుర్తింపు పొందారు.
అమ్మానాన్నలతో అప్ కమింగ్ హీరోయిన్ జాన్వీ స్వరూప్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








