Cinema : అన్నీ గత్తరలేపే సీన్స్.. వణుకుపుట్టించే సినిమా.. ఒంటరిగా చూడాలంటే ఆలోచించాల్సిందే..
హారర్ కామెడీ సినిమాలు చూసేందుకు జనాలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వెన్నులో వణుకుపుట్టించే సీన్స్, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే ట్విస్టులు ఉన్నప్పటికీ దెయ్యం సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా క్లైమాక్స్ చూస్తే ఫ్యూజుల్ అవుట్ అంతే.. ఇంతకీ ఈ మూవీ ఏంటో మీకు తెలుసా.. ?

మలయాళీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రొమాంటిక్, యాక్షన్, హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ ఇలా ఏ జానర్ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులోకి డబ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మీ ముందుకు మలయాళీ నుంచి ఓ క్రేజీ హారర్ కామెడీ సినిమాను తీసుకువచ్చాము. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఆ చిత్రం ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. కేరళలలో ఫేమస్ అయిన ఓ దెయ్యాల రోడ్డు వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథే ఈ సినిమా స్టోరీ. ఇందులో హీరో ఆ రహస్యాన్ని కనిపెట్టాడా.. ? అసలు ఆ దెయ్యం రోడ్డు కథేంటీ అనేది సినిమా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు సుమతి వలవు.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..
కథ విషయానికి వస్తే.. తిరువనంతపురం ఏరియాలో స్థానికంగా జనాలు చెప్పుకునే దెయ్యం కథ ఇది. 1990ల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుంది. సుమతి వలవు అనే రోడ్డు టర్నింగ్ పాయింట్ వద్ద.. 1950లో సుమతి అనే ప్రెగ్నెంట్ మహిళను అక్కడ దారుణంగా హత్య చేస్తారు. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఆ రోడ్డులో తిరుగుతుందని అక్కడ గ్రామస్తులు నమ్ముతారు. అయితే సినిమాలో హీరో అప్పు (అర్జున్ అశోకన్) జీవితం అనుకోకుండా ఆ రోడ్డుకు కనెక్ట్ అవుతుంది. తర్వాత హీరోయిన్ భామ (మాళవిక మనోజ్)తో ప్రేమ.. ఆమె పరిచయంతో అప్పు జీవితంలో ఎలాంటి పరిస్థఇతులు వచ్చాయి అనేది సినిమా. ఈ సినిమాలో ఆద్యంతం ట్విస్టులు కట్టిపడేసినప్పటికీ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి.
ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..
ఈ సినిమా స్టోరీ, క్లైమాక్స్, ట్విస్టులు మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఇంతకీ సుమతి వలవు కథలో దెయ్యం నిజమేనా.. ?లేదా మరేదైనా ఉందా? అనేది సినిమా. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉంది. నిజానికి రోడ్డు మీద దెయ్యాలు ఉండడం అనే స్టోరీస్ మనం చాలాసార్లు వింటుంటాం. ఇప్పుడు అదే కథను వెండితెరపైకి తీసుకువచ్చారు. మరీ ఈ సినిమాను మీరు చూశారా.. ?
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. ఒక్కో మూవీకి 2 కోట్ల రెమ్యునరేషన్.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




