Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..
ప్రస్తుతం ఓ హీరోయిన్ లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తెలుగులో ఒక్క సినిమా చేయకుండానే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ నెట్టింట ఈ అమ్మడు సృష్టిస్తోంది. తమిళంలో ఈ బ్యూటీ చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటుంది.
Updated on: Oct 28, 2025 | 6:47 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో ఒక్క సినిమా చేయకుండానే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాలతో అగ్గిరాజేస్తుంది.

ఆమె మరెవరో కాదండి. దివ్య భారతి. ఈ పేరు చెప్పగానే దివంగత అందాల రాశి గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దివ్య భారతి వేరు. తమిళ చిత్రపరిశ్రమలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తెలుగులోనూ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. తమిళనాడుకు చెందిన ఈ అమ్మడు గురించి తెలుసుకుందామా.

ఎలాంటి ఫిల్మ్ బ్యా్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా తెరంగేట్రం చేసిన బ్యాచిలర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడు పేరు మారుమోగింది. ముఖ్యంగా ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది.

ఆ తర్వాత తమిళంలో మరోసారి జీవీ ప్రకాష్ తో జత కట్టింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రంలోనూ కనిపించింది. ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్ జోడిగా గోట్ చిత్రంలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తున్న దివ్యభారతి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మోడ్రన్ టచ్ ఇస్తూ గ్లామర్ ఫోజులతో అరాచకం సృష్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.




