AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?

ఐఐటీని వదిలేసిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటనపై ఆసక్తితో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఒక కార్పొరేట్ కంపెనీ సీఈవోగా పనిచేస్తుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టాగలరా.. ?

ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
Mayoori Kango
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2025 | 9:58 PM

Share

సినీరంగంలోకి నిత్యం ఎంతో మంది కొత్త నటీనటులు అడుగుపెడుతుంటారు. కొందరు ఉన్నత విద్యను వదిలేసి .. మరికొందరు ఉద్యోగాలను వదిలి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారు. అయితే సినిమాలలో మంచి నటనతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తారలు.. ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ అమ్మాయి.. ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు సినిమాలు వదిలేసి కార్పొరేట్ రంగంలో స్థిరపడింది. ఒకప్పుడు అందమైన రూపం, చక్కని చిరునవ్వుతో కట్టిపడేసింది. 90లలో అభిమానుల హృదయాలు గెలుచుకుంది. హిందీలో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో నటించింది. కానీ అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమైంది. కార్పోరేట్ రంగంలో స్థిరమైన మార్గాన్ని ఎంచుకుంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మయూరి కాంగో. ఒకప్పుడు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన వంశీ సినిమాలో నటించింది. మయూరి అంతకు ముందు 1995లో నసీమ్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. ఈ సినిమా కోసం ఆమె ఐఐటీ కాన్పూర్​లో అడ్మిషన్​ను సైతం వదులుకుంది. ఆ తర్వాత దర్శకుడు మహేశ్ భట్ 1996లో తెరకెక్కించిన ‘పాపా కెహతే హై’ సినిమాతో పాపులర్ అయ్యింది. తెలుగులో వంశీ సినిమా తర్వాత చిత్రాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత బుల్లితెరపై పలు షోస్ చేసింది. 2003లో ఆదిత్య ధిల్లాన్ అనే ఎన్నారైని వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఈ దంపతులకు 2011లో ఒక పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ తర్వాత న్యూయార్క్ లో ఎంబీఏ పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..

మయూరి కాంగో సిస్కో గ్లోబల్ టెక్ కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత 2008లో గూగుల్ ఇండియా కంపెనీలో చేరారు. కొన్నాళ్లకు అంటే 2019లో గూగుల్ ఇండియాలో ఇండస్ట్రీ హెడ్ పదవిని చేపట్టింది. ఇటీవలే ఆమె గ్లోబల్ డెలివరీ ఆఫ్ పబ్లిసిస్ గ్రూప్‌లో చేరి CEO గా పదవిని చేపట్టారు. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు.

Mayoori Kango Ceo

Mayoori Kango Ceo

ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్