Dhruva Sarja: చిక్కుల్లో కన్నడ స్టార్ హీరో.. అర్జున్ మేనల్లుడిపై పోలీస్ కేసు.. ఏం జరిగిందంటే?
ప్రముఖ కన్నడ హీరో ధృవ సర్జాపై బనశంకరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ధృవ సర్జాపైనే కాకుండా ఆయన మేనేజర్, డ్రైవర్, అభిమానులపై కూడా ఫిర్యాదు నమోదైంది. అంతేకాదు వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?

బెంగళూరులోని బనశంకరి పోలీస్ స్టేషన్‌లో హీర ధ్రువ సర్జాపై కేసు నమోదైంది . ధ్రువ సర్జాపైనే కాకుండా అతని మేనేజర్, కారు డ్రైవర్, అభిమానులపై కూడా ఫిర్యాదు నమోదైంది. ఇంతకీ ధ్రువ సర్జాపై ఫిర్యాదు చేసింది మరెవరో కాదు అతని పొరుగింటివారే. మనోజ్ అనే వ్యక్తి కన్నడ హీరోపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధ్రవ సర్జా అభిమానుల ప్రవర్తనతో విసిగిపోయిన అతను బనశంకరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ధ్రువ సర్జా ఇంటికి వచ్చే అభిమానులు తమ కార్లను రోడ్డుపై, తమ ఇంటి ముందు అడ్డదిడ్డంగా పార్క్ చేస్తున్నారని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు వారు అరుస్తూ, కేకలు వేస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అభిమానులు తమ ఇంటి ముందు సిగరెట్లు కాల్చుతున్నారని, గుట్కాలు తింటూ ఇంటి గోడలపై ఉమ్మి వేస్తున్నారని మనోజ్ మండి పడ్డాడు. రోడ్లపై పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఫిర్యాదు దారుడు పేర్కొన్నాడు. ఈ విషయం గురించి నటుడి మేనేజర్ మరియు డ్రైవర్‌కు సమాచారం అందించారు, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ధ్రువ సర్జా అభిమానుల వల్లే ఈ సమస్య వచ్చిందని మనోజ్ తెలిపాడు.
మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు NCR (నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్) మాత్రమే నమోదు చేశారు. అయితే, ధ్రువ సర్జా, అతని మేనేజర్, డ్రైవర్‌పై FIR నమోదు చేయాలని ఫిర్యాదుదారుడు డిమాండ్ చేశారు. అయితే, ఎటువంటి FIR నమోదు కాలేదు. బదులుగా, NCR మాత్రమే నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కేడీ.. ద డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు ధ్రువ సర్జా. ప్రేమ్ తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించనున్నాడు. అలాగే శిల్పా శెట్టి చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించనుంది. రవిచంద్రన్, రమేశ్ అరవింద్, నోరా ఫతేహి తదితరులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
Mass Rampage Unleashed in BANGLORE! 💥
Here’s a glimpse of the explosive energy that shook the ground at the #KDTheDevil Teaser Launch Event! 🔥#KDTeaser ▶️ https://t.co/nz1gmMRR4g#KD @DhruvaSarja @directorprems @duttsanjay @Ramesh_aravind #VRavichandran @TheShilpaShetty… pic.twitter.com/c0VigaUGxT
— KVN Productions (@KvnProductions) July 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








