AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : బాక్సాఫీస్‏ను ఊపేసిన హారర్ సినిమాలు.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న ఈ మూవీస్ చూశారా.. ?

హారర్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దెయ్యాలు, ఆత్మల గురించి వచ్చే సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంటాయి. ఇటీవల విడుదలైన థామా సినిమా సైతం థియేటర్లోల దూసుకుపోతుంది. ఇందులో రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా ఐదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Cinema : బాక్సాఫీస్‏ను ఊపేసిన హారర్ సినిమాలు.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న ఈ మూవీస్ చూశారా.. ?
Cinema (1)
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2025 | 10:11 PM

Share

సాధారణంగా హారర్ కామెడీ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. నిత్యం కొత్త కొత్త కంటెంట్ హారర్ సినిమాలు అడియన్స్ ముందుకు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు అదే చిత్రాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఇంతకీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్న హారర్ సినిమాల గురించి తెలుసుకుందామా. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన చిత్రం భేడియా. దీనికి సీక్వెల్ త్వరలో రాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..

అలాగే రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్ నటించిన హారర్ సినిమా స్త్రీ. ప్రస్తుతం హారర్ కామెడీ చూడాలనుకుంటున్నవారికి ఇది సరైన ఎంపిక. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. హారర్ కామెడీల గురించి చెప్పాలంటే అక్షయ్ కుమార్ ఐకానిక్ పెర్ఫార్మెన్స్ ఉన్న భూల్ భూలయ్యా. మేకర్స్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్‌ను హారర్ కామెడీ ట్విస్ట్‌తో కలిపారు. భూల్ భూలయ్యాలో విద్యాబాలన్ కూడా ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..

ఇక రూహి సినిమా గురించి కూడా తెలుసుకోవాల్సిందే. స్త్రీ చిత్రం నిర్మాతలు నిర్మించిన ఈ కామెడీ-హారర్ చిత్రంలో రాజ్‌కుమార్ రావు , జాన్వీ కపూర్ నటించారు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. టబుతో కలిసి నటించిన భూల్ భూలయ్యా 2 లో అక్షయ్ కుమార్ స్థానంలో కార్తీక్ ఆర్యన్ నటించాడు. ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. గతేడాది విడుదలైన స్త్రీ 2 సైతం సరైన ఎంపిక. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..