Ranbir Kapoor : రాముడిగా రణబీర్ కపూర్.. రామాయణంపై ట్రోల్స్.. స్పందించిన సద్గురు..
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా రామాయణం. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రణబీర్ కపూర్, సాయి పల్లవి, సన్నీ డియోల్, కాజల్, యష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా పై వస్తున్న ట్రోల్స్ పై సద్గురు స్పందించారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న రామాయణ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బీటౌన్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా.. రావణుడిగా యష్ నటిస్తున్నారు. అయితే శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తుండడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రణబీర్ రాముడి పాత్రను పోషించడమేంటీ అంటూ పలువురు ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్, విమర్శలపై ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు.. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు. రణబీర్ కపూర్ రాముడిగా నటించడం పై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..
తాజాగా నిర్మాత నమిత్ మల్హోత్రాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సద్గురు మాట్లాడుతూ.. “గతంలో రణబీర్ కపూర్ కొన్ని భిన్నమైన పాత్రలు చేశాడని.. ఇప్పుడు రాముడి పాత్ర చేయడం సరిపోడంటూ ట్రోల్స్ చేయడం అన్యాయం. భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి ముందే తెలియదు కదా.. ? రేపు మరో సినిమాలో అతడు రావణుడిగా నటించవచ్చు. అప్పుడు కూడా ఇలాగే విమర్శిస్తారా.? ఇలా విమర్శించడం సరైన పద్దతి కాదు” అని అన్నారు. అలాగే రావణుడి పాత్రలో నటిస్తున్న యష్ పై ప్రశంసలు కురిపించారు. అతడు అందమైన , తెలివైన వ్యక్తి అని అన్నారు సద్గురు.
ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..
సినిమాలో రాముడి పాత్రలో నటిస్తున్నారు అంటే.. అతడు రాముడులాగే ఉండాలని మనం అంచనాలు పెట్టుకోవడం సరికాదని అన్నారు. అతడికి యాక్టింగ్ అనేది అతడి వృత్తి. కేవలం నటిస్తున్నాడు. కాకపోతే రాముడి పాత్రలో నటిస్తున్నప్పుడు కనీసం కొన్ని లక్షణాలు ఉండడం ముఖ్యమని అన్నారు. ప్రస్తుతం సద్గురు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..




