Actor : ఒకప్పుడు స్టార్ హీరో.. 19 ఏళ్ల పనిమనిషిపై అత్యాచారం.. 7 సంవత్సరాల జైలు శిక్ష.. ఇప్పుడేం చేస్తున్నాడంటే..
ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పాడు. అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశాడు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 19 ఏళ్ల పనిమనిషిపై ఆత్యాచారం చేసిన కేసులో జైలు పాలయ్యాడు. ఆ ఆరోపణలు నిజమని తేలడంతో అతడికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇప్పుడు ఆ నటుడు సినీరంగానికి దూరంగా ఉండిపోయాడు. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..

ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో హ్యాండ్సమ్ హీరో. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టిన వెంటనే అభిమానుల హృదయాలను ఏలిన నటుడి గురించి మీకు తెలుసా..? కానీ ఒక తప్పు ఆ నటుడి జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు బట్టలు అమ్ముతూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకప్పుడు ఇండస్ట్రీలో సంచలన హీరోగా మారాడు. కానీ వివాదాల కారణంగా కెరీర్ ముగిసిపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. మనం మాట్లాడుకుంటున్న హీరో పేరు షైనీ అహుజా.
ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన భూల్ భూలైయా, ఆమిర్ ఖాన్ నటించిన ఫనా చిత్రాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు. షైనీ కెరీర్ ముగియడానికి కారణం అతనిపై వచ్చిన అత్యాచార ఆరోపణలే. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. 2009లో తన ఇంట్లో పనిచేసే 19 ఏళ్ల పనిమనిషిపై అత్యాచారం, కిడ్నాప్, బెదిరించడం వంటి ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేశారు. . కొన్ని నెలల తర్వాత, ఢిల్లీ విడిచి వెళ్లకూడదనే షరతుపై అతనికి బెయిల్ లభించింది. కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి ఫిర్యాదును ఉపసంహరించుకుంది. కానీ 2011లో ముంబైలోని ఒక కోర్టు షైనీని దోషిగా నిర్ధారించి అతనికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..
ఆ తర్వాత ఆ ఉత్తర్వుకు వ్యతిరేకంగా షైనీ బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతడికి బెయిల్ లభించింది. 2003లో బాంబే హైకోర్టు అతని పాస్‌పోర్ట్‌ను 10 సంవత్సరాల పాటు పునరుద్ధరించుకోవడానికి అనుమతించింది. ఇక ఇప్పుడు అతడు ఫిలిప్పీన్స్‌లో స్థిరపడి అక్కడ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడని సమాచారం.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..




