Salman Khan : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్ ఖాన్.. తెలంగాణ అభివృద్ధిపై బాలీవుడ్ హీరో రియాక్షన్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గురువారం రాత్రి ముంబైలో సీఎంతో కొంత సమయంపాటు సల్మాన్ ఖాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో ఒక డాక్యుమెంట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాబోయే 20 ఏళ్లలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారనే కోణంలో రాష్ట్ర పౌరులు తమ ఆలోచనలు, సూచనలను ఈ సర్వేలో చెప్పవచ్చు.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గురువారం రాత్రి ముంబైలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సల్మా్న్ సమావేశమయ్యారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో ఒక డాక్యుమెంట్ రూపొందిస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్లలలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకుంటున్నారో రాష్ట్ర పౌరులు తమ ఆలోచనలు, సూచనలను, తమ అభిప్రాయాలను ఈ సర్వేలో వెల్లడించవచ్చు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సల్మాన్.. తెలంగాణలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక ప్రోత్సాహంలో జరుగుతున్న అభివృద్ధిని సల్మాన్ ఖాన్ ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి : Actress: 150కి పైగా సీరియల్స్.. ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలిసే భిక్షాటన చేస్తూ ..
తెలంగాణ రాష్ట్రంలో వేగవంతంగా పురోగతి చెందుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రైజింగ్ సందేశాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. సల్మాన్ ఖాన్ అభిప్రాయాలకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సల్మాన్ వంటి తారలు దేశంతోపాటు విదేశాలలో రాష్ట్ర ప్రతిష్టను ప్రోత్సహించడంలో సహాయపడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సినిమా ప్రమోషన్స్, పర్యాటకం, పెట్టుబడులు వంటి రంగాలలో కలిసి పనిచేసే అవకాశాలపై ఇద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి.. సినిమాలు వదిలేసి గూగుల్ కంపెనీ సీఈఓగా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ?
ఇక సల్మాన్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా సికిందర్ సినిమాలో కనిపించారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సల్మాన్ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ మూవీలో నటిస్తున్నారు. గల్వాన్ లోయలో ఇండియా, చైనా మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actor : 26 అనాథాశ్రమాలు.. 46 ఉచిత పాఠశాలలు.. రియల్ లైఫ్ హీరో.. సమాజం కోసం జీవితం ఇచ్చిన హీరో..
ఇవి కూడా చదవండి : ఎన్నాళ్లకు కుదిరిందయ్యో.. అప్పుడు ప్రేయసిగా. ఇప్పుడు స్పెషల్ సాంగ్లో
