30 October 2025

ఎన్నాళ్లకు కుదిరిందయ్యో.. అప్పుడు ప్రేయసిగా. ఇప్పుడు స్పెషల్ సాంగ్‏లో

Rajitha Chanti

Pic credit - Instagram

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి నెట్టింట క్రేజీ న్యూస్ వైరలవుతుంది.

పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండనుందని.. సినిమా మొత్తానికి ఆ సాంగ్ హైలెట్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.

ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ చందమామ కాజల్ స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ పాట అదిరిపోతుందని అంటున్నారు.

గతంలో చరణ్, కాజల్ కలిసి మగధీర, గోవిందుడు, అందరివాడేలే సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరు జోడి కట్టనున్నారు.

చాలా కాలం తర్వాత హిట్ పెయిర్ ఇప్పుడు మరోసారి స్క్రీన్ పై కనిపించనున్నారు. అయితే పెద్ది సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ పై క్లారిటీ మాత్రం రాలేదు.

పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్.. ఇటీవలే కన్నప్ప సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో పార్వతిగా కనిపించింది. 

ఇప్పుడు పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందనే టాక్ నడుస్తోంది. గతంలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే రంగస్థలంలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఇక ఇప్పుడు పెద్ది సినిమాలో చరణ్ జోడిగా కాజల్ స్పెషల్ సాంగ్ చేయనుండడంతో ఈ సినిమాపై మరింత పైప్ నెలకొంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక.