Sekhar Kammula: డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూతురును చూశారా? బర్త్ డే ఫొటోస్ వైరల్.. త్వరలోనే సినిమాల్లోకి!
సినిమాల పరంగా శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన ట్యాలెంట్ ఏంటో ఆయన తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాలే చెబుతాయి. అయితే సినిమా సంగతులు తప్పితే శేఖర్ కమ్ముల ఫ్యామిలీ విషయాల గురించి చాలా మందికి పెద్దగా తెలియవు.

సినిమా ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములది 25 ఏళ్ల ప్రస్థానం. 2000లో డాలర్ డ్రీమ్స్ సినిమాతో మొదలైంది ఆయన సినీ ప్రస్థానం ఆ తర్వాత ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ, రీసెంట్ గా కుబేర సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫీల్ గుడ్ సినిమాలు, లవ్ అండ్ ఫ్యామిలీ అండ్ ఓరియెంటెడ్ సినిమాలను తెరకక్కించడంలో శేఖర్ కమ్ముల స్పెషలిస్ట్. ఆయన సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాగా లవ్ స్టోరీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ ఏడాది కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కోలీవుడ్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున మరో లీడ్ రోల్ లో మెరిశాడు. జూన్ 20న తెలుగుతో పాటు తమిళ్ లో రిలీజైన ఈ సినిమా బ్లాక బస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. శేఖర్ కమ్ముల ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. సినిమా రిలీజులప్పుడు తప్పితే శేఖర్ కమ్ముల కూడా పెద్దగా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండరు. అయితే ఇప్పుడిప్పుడే శేఖర్ కమ్ముల కూతురు వందన బయట కనిపిస్తోంది. సినిమా ఈవెంట్లలోనూ మెరుస్తోంది. ఆ మధ్యన హైదరాబాద్‌లో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ సందడి చేసిన వందన ఆ తర్వాత తన తండ్రి సినిమాకు రివ్యూ ఇస్తూ వైరల్ అయిపోయింది.
తాజాగా వందన తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వందనను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే శేఖర్ కమ్ములకు ఇంత పెద్ద కూతురు ఉందా? అంటూ అని ఆశ్చర్యపోతున్నారు.
శేఖర్ కమ్ముల కూతురు బర్త్ డే ఫొటోస్ వైరల్..
View this post on Instagram
కాగా ప్రస్తుతం వందన చదువుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినిమాలపై కూడా ఆసక్తి ఉదంట. సో. . త్వరలోనే వందన కూడా తండ్రిలానే సినిమాల్లోకి వస్తుందేమో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








