Director Nag Ashwin: ఆ సినిమా ట్రైలర్ చూసి డిప్రెషన్లోకి వెళ్లిన కల్కి డైరెక్టర్.. కారణం ఇదే..
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ మోస్ట్ డిమాండ్ డైరెక్టర్స్ లో నాగ్ అశ్విన్ ఒకరు. విభిన్నమైన కథలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యారు. ఇటీవల కల్కి చిత్రంతో మరోసారి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కల్కి 2 ప్రాజెక్టు పనిలో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్.. తాజాగా ఓ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారు.

తెలుగు సినీరంగంలో వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. తీసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. విభిన్నమైన కంటెంట్ తో అడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఒక సినిమాను మించి ఇంకో సినిమా హిట్ అయ్యింది. ఇటీవల ప్రభాస్ హీరోగా కల్కి సినిమాతో మరో సంచలన విజయం అందుకున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీతోపాటు మలయాళం, కన్నడ, తమిళం, హిందీ భాషలకు చెందిన పలువురు స్టార్ కనిపించారు. ప్రస్తుతం కల్కి 2 ప్రాజెక్ట్ పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్. ఈ క్రమంలోనే తాజాగా ఓ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారు నాగ్ అశ్విన్. ఈ కార్యక్రమంలో వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలోనే కొత్త కథలు రాయాలంటే కష్టం అనిపిస్తుందా ? అని ఓ స్టూడెంట్ అడగ్గా.. నాగ్ అశ్విన్ సమాధానమిస్తూ.. “అవును.. నేను ఏదైనా ఒక కథ రాసుకుంటే కొన్ని నెలలకు అదే ఐడియా వేరే సినిమాలోనో.. లేదా ట్రైలర్ లోనో కనిపిస్తుంది. 2008లో నేను జ్ఞాపకాలు, కలలు నేపథ్యంలో ఓ కథ రాసుకున్నాను.ఆ తర్వాత కొన్నాళ్లకు అదే కాన్సెప్ట్ తో హాలీవుడ్ సినిమా ఇన్స్పెషన్ ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత దాదాపు వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అయితే సరే ఎప్పుడూ కొత్త కొత్త కథలను రాసుకుంటాను. ఎక్కడా రాని పాయింట్ గురించి సినిమాలు తీయాలి మరీ” అని చెప్పుకొచ్చారు.
ఇక నాగ్ అశ్విన్ చెప్పిన ఇన్సెప్షన్ మూవీకి డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించారు. 2010లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఆ సినిమా స్క్రీన్ ప్లే అర్థంకానీ వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ సినిమాకు అన్ని దేశాల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి :