AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr. NTR: ఎన్టీఆర్ ఎందుకు సన్నగా అయ్యారు.. ? క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటున్నారు తారక్. అయితే ఇటీవల ఎన్టీఆర్ న్యూలుక్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు.

Jr. NTR: ఎన్టీఆర్ ఎందుకు సన్నగా అయ్యారు.. ? క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..
Ntr, Kalyan Ram
Rajitha Chanti
|

Updated on: Apr 15, 2025 | 6:15 PM

Share

కొన్ని రోజులుగా వార్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈసినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అంతేకాకుండా ఇందులో బీటౌన్ స్టార్ హృతిక్ రోషన్ సైతం ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ స్టార్ట్ చేశారు తారక్. ఈనెలలోనే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. అయితే ఇటీవల ఓ కమర్షియల్ ప్రకటనలో కనిపించిన తారక్ లుక్స్ చూసి షాకయ్యారు ఫ్యాన్స్. దేవర సినిమా తర్వాత పూర్తిగా సన్నబడి.. అసలు ఊహించని లుక్ లో ఎన్టీఆర్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అసలు తారక్ కు ఏమైందీ అనే సందేహాలు సైతం వ్యక్తమయ్యాయి. అలాగే ఇటీవల మ్యాడ్ స్కైర్ సక్సెస్ మీట్.. కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ s/o వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఎన్టీఆర్ పాల్గొన్నారు. అయితే తారక్ లుక్స్ పై మాత్రం విపరీతమైన సందేహాలు ఉన్నాయి. తాజాగా వీటన్నింటికి క్లారిటీ ఇచ్చారు కళ్యాణ్ రాణ్.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అర్జున్ s/o వైజయంతి మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఎందుకు సన్నగా అయ్యారు.. మీరేమైనా ట్రైనింగ్ ఇచ్చారా.. ? అని అడగ్గా.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “ఎన్టీఆర్ ఓ సూపర్ స్టార్. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్. నేషనల్ లెవల్ కు ఆయన స్థాయి చేరింది. దేశంలోనే టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు. వాళ్లిద్దరికీ నేను సలహాలు ఇస్తానా..? నేను, తారక్ ఏం చేసినా సినిమా కోసమే..” అంటూ చెప్పుకొచ్చారు.

దేవర తర్వాత వార్ 2 చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇటీవల ఆయనకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా..అందులో సన్నగా కనిపించారు. ఇక కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ s/o వైజయంతి సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలకపాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?