Tollywood: రూ.1800 కోసం అలాంటి పనులు చేశా.. ఇప్పుడు చనిపోవడానికైనా రెడీ.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
చాలా మంది హీరోయిన్లలాగే ఈ అమ్మడు కూడా కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కుటుంబ పోషణ కోసం రకరకాల జాబులు, పనులు చేసింది. డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.

బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ, తెలుగు యాంకర్ అరియానా గ్లోరీ గురించి తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అక్కర్లేదు. టిక్‌టాక్ వీడియోలు, రీల్స్‌తో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు రియాలిటీషోతో మరింత పాపులర్ అయ్యింది. ఇక ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి బోల్డ్ యాంకర్ గానూ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్ సిరీసులతోనూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది అరియానా. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి రాకముందు తనకు ఎదురైన కష్టాలు, చేదు అనుభవాలను షేర్ చేసుకుని ఎమోషనలైంది. ‘నా అసలు పేరు అరియానా కాదు. మా అమ్మనాన్నలు నాకు అర్చన అని పేరు పెట్టారు. అయితే కారణమేంటో తెలియదు కానీ కష్టాలు ఎక్కువ అయ్యాయి. అందుకే నేనే పేరు మార్చుకున్నా. అరియానా పేరుతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. మన జీవితంలో ఏం జరగాలో, ఏది జరగకూడదో ముందే రాసి పెట్టి ఉంటుంది.’
‘డబ్బుల కోసం నేను రకరకాల జాబులు చేశాను. లైన్‌లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. అప్పుడు నాకొచ్చే జీతం ఎంతో తెలుసా? కేవలం రూ. 1800 మాత్రమే. కానీ రూమ్ రెంట్ రూ. 3000. ఒకసారి అద్దె కట్టేందుకు డబ్బులు పోగు చేయగా.. ఓ అమ్మాయి దొంగతనం చేసింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డాను. డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేయాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ ఇప్పుడు నేను కొంచెం బెటర్ పొజిషన్ లో ఉన్నాను. మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుందనుకుంటనాఉ. నేను అనుకోకుండా ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. అనుకోకుండానే యాంకర్ అయ్యాను. ఒక రోజు నేను, మా చెల్లి టీవీ చూస్తుంటే.. యాంకర్స్ కావాలన్న ప్రకటన చూశాను. వెంటనే ఆడిషన్స్‌కి వెళ్లాను. అదృష్టం కొద్ది సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నాను’ అని అరియానా చెప్పుకొచ్చింది.
అరియానా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఇదే ఇంటర్వ్యూలో ‘మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని యాంకర్ అడగ్గా అరియానా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘మా అమ్మ నన్ను క్రిస్టియన్‌లా పెంచింది. కానీ ఈ మధ్య నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తీసుకెళ్లిపో అని చెబుతా. అవును.. దేవుడే వచ్చి అడిగాక ఇంకేముంది?. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడు, ఈ క్షణం నేను చనిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను’ అని అరియానా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




