Komati Reddy: ‘బలగం’ తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి ప్రశంసలు
ఈ మధ్యన తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. వీటికి ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ వస్తోంది. కొన్ని నెలల క్రితం తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన బలగం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

క్రిస్మస్ కానుకగా తెలుగులో దాదాపు అరడజనకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రోషన్ మేక ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంభాల, దండోరా,ఇషా, పతంగి, బ్యాడ్ గర్ల్స్ తో పాటు వృషభ అనే మలయాళ సినిమా కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తాజాగా ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. బలగం తర్వాత చాలా రోజులకు మరో మంచి సినిమాను చూశానన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘తెలంగాణ నేల నుంచి పుట్టిన ఈ చిత్రం సామాజిక అంశాలను మనసును తాకేలా ఆవిష్కరిస్తూ, తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలుపుతుంది. గ్రామీణ జీవనశైలి, మనుషుల మధ్య ఉన్న సూక్ష్మ సంబంధాలను సహజంగా చూపిస్తూ నిజ జీవితానికి అద్దం పడుతుంది. మన చుట్టూ నిత్యం కనిపిస్తూనే పట్టించుకోని ఒక సామాజిక సమస్యను సున్నితంగా ప్రశ్నిస్తూ ఆలోచనకు దారితీసే సినిమా ‘దండోరా’. ‘బలగం’ తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన సినిమా ‘దండోరా’. వినోదంతో పాటు విలువైన సందేశం అందించిన #Dhandoraa టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు’ అని మంత్రి కోమటి రెడ్డి ట్వీట్ లో రాసుకొచ్చారు.
మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ‘దండోరా’. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాజీ, నందు, మౌనిక రెడ్డి, నవదీప్, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. పోటీలో చాలా సినిమాలు ఉన్నా మౌత్ టాక్ తో మంచి వసూళ్లు రాబడుతోంది. సామాన్య జనాలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాను చూస్తున్నారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నరు. అలా తాజాగా మంత్రి కోమటి రెడ్డి దండోరా సినిమాను వీక్షించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
దండోరా సినిమాపై మంత్రి కోమటి రెడ్డి ట్వీట్..
తెలంగాణ నేల నుంచి పుట్టిన ఈ చిత్రం సామాజిక అంశాలను మనసును తాకేలా ఆవిష్కరిస్తూ, తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలుపుతుంది.
గ్రామీణ జీవనశైలి, మనుషుల మధ్య ఉన్న సూక్ష్మ సంబంధాలను సహజంగా చూపిస్తూ నిజ జీవితానికి అద్దం పడుతుంది.
మన చుట్టూ నిత్యం కనిపిస్తూనే పట్టించుకోని ఒక సామాజిక… pic.twitter.com/ZTRnZ7x9fb
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




