హనుమంతుడి జన్మస్థలాన్ని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు.. 575 మెట్లు ఎక్కి అంజనాద్రి కొండపైకి.. వీడియో
సినిమా షూటింగు పనుల నుంచి విరామం తీసుకున్న ఈ స్టార్ హీరో భార్యతో కలిసి రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నాడు. అలా తాజాగా హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి కొండను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భార్యభర్తలిద్దరూ కలిసి సామాన్య భక్తుల్లో కలిసిపోయి కొండకు చేరుకున్నారు.

‘కాంతారా ఛాప్టర్ 1′ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు కన్నడ సూపర్ స్టార్ రిషభ్ శెట్టి. దసరా కానుకగా అక్టోబర్ 02న విడుదలైన ఈ డివోషనల్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబట్టింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కాంతార ఛాప్టర్ 1 సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కోసం రేయింబవళ్లు శ్రమించిన రిషభ్ శెట్టి ఇప్పుడు కాస్త రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు. సినిమా షూటింగ్ పనుల నుంచి విరామం తీసుకుని కుటుంబంతో గడుపుతున్నాడు. అలాగే భార్యతో కలిసి రాష్ట్రంలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నాడు. ఇప్పటికే తిరుపతి, తిరుమల, మంత్రాలయం, మైసూరులోని చాముండి కొండను సందర్శించారు రిషబ్ దంపతులు. తాజాగా ఆయన కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలోని చారిత్రక అంజనాద్రి కొండను సందర్శించారు. అక్కడున్న ఆంజనేయుడిని స్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.
కాగా కొండపై ఉన్న ఆంజనేయుడి దర్శనం కోసం రిషబ్ శెట్టి సామాన్యుడిలా 575 మెట్లు ఎక్కి కొండపైకి చేరుకున్నారు. ముందుగా ఆలయంలో మారుతికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత హనుమంతుడిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దర్శనానంతరం అంజనాద్రి ఆలయ ప్రధాన అర్చకులు రిషబ్ శెట్టికి హనుమంతుని జన్మస్థలం పురాణం, చరిత్ర గురించి వివరంగా తెలిపారు. అలాగే కాంతారా సినిమా ద్వారా కన్నడ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినందుకు రిషభ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాంతారా హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. కాగా కాంతారా ఛాప్టర్ 1 తర్వాత రిషభ్ శెట్టి తర్వాతి ప్రాజెక్టు గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సామాన్య భక్తుల్లో కలిసిపోయి అంజనాద్రి కొండ ఎక్కుతున్న రిషబ్ శెట్టి- ప్రగతి దంపతులు.. వీడియో..
Film actor Rishab Shetty’s visit to Anjanadri Hills🚩 reflects his deep roots in Sanatana Dharma. The Indian film industry truly needs more such grounded and culturally rooted artists.#Rishabshetty#SanatanDharma pic.twitter.com/3mypPMYLBQ
— Chutki Chaiwali🇮🇳 (@Chai_Angelic) December 26, 2025
స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటోన్న కాంతారా హీరో..
@shetty_rishab and @PragathiRShetty in Anjanadri hill today #Hampi #Vijayanagara pic.twitter.com/PsK1Pe8HY1
— Ballari Tweetz (@TweetzBallari) December 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




