AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పెళ్లి రోజునే.. రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ స్టార్ నటి.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ నటి శుభవార్త చెప్పింది. తమ పెళ్లి రోజే తనకు పండంటి బిడ్డ జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టిందీ అందాల తార. దీంతో పలువురు ప్రముఖులు ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tollywood: పెళ్లి రోజునే.. రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ స్టార్ నటి.. ఫొటోస్ వైరల్
Actress Chaithra Rai
Basha Shek
|

Updated on: Dec 26, 2025 | 3:30 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటి గుడ్ న్యూస్ చెప్పింది. తాను మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు తమ చిట్టి బుజ్జాయి చేతి ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘మా జీవితాల్లో మరో అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభించాయి. మా కుటుంబంలోకి మరో పండంటి మహాలక్ష్మి అడుగుపెట్టింది. మా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది. మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! మేమిద్దరం ఇప్పుడు నలుగురమయ్యాం. ఈ పెళ్లిరోజుతో మా కుటుంబం పరిపూర్ణమైంది’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చిందీ అందాల తార. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలా అభిమానుల అభినందనల వర్షంలో మునిగితేలుతోన్న ఆ అందాల తార మరెవరో కాదు చైత్ర రాయ్. ఈ పేరు చెబితే చాలామంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ ఎన్టీఆర్ దేవర సినిమాలో విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్యగా కనిపించిన నటి అంటే ఇట్టే గుర్తు పడతారు.

ఇవి కూడా చదవండి

కన్నడ నాటకు చెందిన చైత్ర రాయ్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా సీరియల్స్ చూసే వారిలో చాలా మందికి ఈ నటి ఫేవరెట్. అష్టాచమ్మా సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛైత్ర. ఆ తర్వాత అత్తో అత్తమ్మ కూతురో, దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, మనసున మనసై, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు వంటి పలు సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించింది. తన అభినయంతో తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. సీరియల్స్ తో పాటు దేవర లాంటి సినిమాల్లోనూ అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది చైత్ర.

చైత్ర రాయ్ ఎమోషనల్ పోస్ట్..

చైత్ర వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2016లో ఇంజనీర్‌ ప్రసన్న శెట్టిని పెళ్లి చేసుకుందీ అందాల తార. ఈ దంపతులకు 2021లో కూతురు నిష్క శెట్టి పుట్టింది. ఇప్పుడు మరో చిట్టి పాపను తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్.

సీమంతం వేడుకలో భర్తతో చైత్ర రాయ్.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు.. సింహం – చిట్టెలుక కథ
ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు.. సింహం – చిట్టెలుక కథ
ఫుట్‌బాల్ మైదానంలో టీమిండియా క్రికెటర్ల సందడి
ఫుట్‌బాల్ మైదానంలో టీమిండియా క్రికెటర్ల సందడి
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..
ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. ఈ రూట్లలో స్పెషల్ ట్రైన్స్..
చల్లని వాతావరణంలో పచ్చి మిర్చిని తలదన్నే ఈ బజ్జీలు తింటే
చల్లని వాతావరణంలో పచ్చి మిర్చిని తలదన్నే ఈ బజ్జీలు తింటే
నీళ్ళు లేకుండా పండే ఎకైక పంట.. ఎకరానికి 8-12 క్వింటాళ్ల దిగుబడి
నీళ్ళు లేకుండా పండే ఎకైక పంట.. ఎకరానికి 8-12 క్వింటాళ్ల దిగుబడి
గురు, కేతువుల యుతి.. ఈ రాశుల వారికి అనూహ్య లాభాలు..!
గురు, కేతువుల యుతి.. ఈ రాశుల వారికి అనూహ్య లాభాలు..!
అనిరుధ్-కావ్య పెళ్లికి నవంబర్ 11నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ తేదీ..
అనిరుధ్-కావ్య పెళ్లికి నవంబర్ 11నే ఎందుకు ఎంచుకున్నారు? ఈ తేదీ..
ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. మోస్ట్ డేంజరస్ బౌలర్ దిగుతున్నాడు
ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. మోస్ట్ డేంజరస్ బౌలర్ దిగుతున్నాడు
UPSC ఇంటర్వ్యూ బోర్డులో ఒకరు AI రోబో అయితే ఎలా గుర్తిస్తారు?
UPSC ఇంటర్వ్యూ బోర్డులో ఒకరు AI రోబో అయితే ఎలా గుర్తిస్తారు?
ఇవి తీసుకుంటే కళ్ళ మసక తగ్గి.. కళ్ళద్దాలకు గుడ్ బై చెబుతారు
ఇవి తీసుకుంటే కళ్ళ మసక తగ్గి.. కళ్ళద్దాలకు గుడ్ బై చెబుతారు