AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar: ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. ఈ లెక్కల మాస్టారి లవ్ స్టోరి మాములుగా లేదుగా.. సినిమాలకు మించి..

'ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది' అన్నట్లు డైరెక్టర్ సుకుమార్ సక్సెస్ వెనక ఆయన భార్య బబితా సపోర్ట్ కూడా చాలా ఉంది. మరి అసలు వీరి పరిచయం ఎలా మొదలైంది? ఎలా ప్రేమలో పడ్డారు? పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకున్న వీరి లవ్ స్టోరీలో సినిమాలకు మించి ట్విస్టులు ఉన్నాయి.

Sukumar: ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. ఈ లెక్కల మాస్టారి లవ్ స్టోరి మాములుగా లేదుగా.. సినిమాలకు మించి..
Director Sukumar love story
Basha Shek
|

Updated on: Dec 26, 2025 | 5:26 PM

Share

ఆర్య సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. తన డిఫరెంట్ టేకింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. జగడం, ఆర్య2, 100 పర్సెంట్ లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప, పుష్ప 2 సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా మారిపోయాడీ లెక్కల మాస్టారు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ క్రేజీ డైరెక్టర్ తో నటించేందుకు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సుకుమార్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. సుకుమార్ సతీమణి పేరు తబిత. 2004లో వీరి వివాహం జరిగింది. ఇప్పుడు వీరికి సుక్రాంత్, సుకృతి అనే పిల్లలు ఉన్నారు.మొన్నటి వరకు ఇంటికే పరిమితమైన సుకుమార్ భార్య తబిత ఇప్పుడు సినిమా ఫంక్షన్లలో కనిపిస్తోంది. అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

అన్నట్లు సుకుమార్-తబితలది ప్రేమ వివాహం. వీరి లవ్ స్టోరీ అచ్చం సినిమాను తలపిస్తుంది. సుకుమార్ మొదటి సినిమా ఆర్య సినిమా రిలీజ్ సమయంలో వీరు మొదటి సారి కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ లో సుకుమార్ ను చూసిన బబిత ఆటోగ్రాఫ్ కోసం డైరెక్టర్ దగ్గరకు వెళ్లిందట. ఆమెను చూడగానే ఇంప్రెస్ అయిన సుకుమార్, ఆటోగ్రాఫ్‌కు బదులుగా తన ఫోన్ నంబర్ ఇచ్చాడట. అలా మొదలైన వీరి పరిచయం నాలుగేళ్ల పాటు ప్రేమాయణంగా సాగింది. అయితే వీరి పెళ్లికి పేరెంట్స్ నో చెప్పారట. సుకుమార్ సినిమా ఇండస్ట్రీ వ్యక్తి కావడంతో తబిత తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదట.

ఇవి కూడా చదవండి

భార్య తబితతో డైరెక్టర్ సుకుమార్..

మరోవైపు సుకుమార్ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారట. చివరకు తబిత సోదరి మాత్రమే వీరి పెళ్లికి వచ్చిందట. పెళ్లి వేడుక ముగిశాక సుకుమార్- తబిత జంట స్వయంగా వెళ్లి తబిత తల్లిదండ్రుల కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారట. ఆ తర్వాతే వాళ్లే మనసు మార్చుకుని సుకుమార్-తబిత దంపతులను ఆశీర్వదించారట.

డైరెక్టర్ సుకుమార్ ఫ్యామిలీ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.