26 December 2025

రోజుకు 10 ఇడ్లీలు తింటా.. 10 నెలల్లో 10 కిలోలు తగ్గిన.. హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఇటీవలే రివాల్వర్ రీటా మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్.. 10 నెలల్లో పది కిలోలు బరువు తగ్గినా అంటూ డైట్ సీక్రెట్ రివీల్ చేసింది. 

బాలనటిగా తెరంగేట్రం చేసిన కీర్తి సురేష్ గీతాంజలి మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక సినిమాల్లో నటించింది. కీర్తి సురేష్ తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 

కీర్తి మొదట్లో కాస్త బొద్దుగా ఉండేదట అప్పట్లో తన ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉండేవని.. ఒకేసారి పది దోసేలు లేదా పది ఇడ్లీలు తిన్నానని తెలిపింది. 

కానీ ఇప్పుడు తన ఫిట్నెస్ పై మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలిపింది. వ్యాయమం చేయడంతోపాటు ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ప్రారంభించిదట.

తన ఆహారపు అలవాట్లను చాలావరకు నియంత్రించుకున్నానని.. అందుకే పది నెలల్లో దాదాపు 10 కిలోల వరకు తగ్గినట్లు డైట్ సీక్రెట్స్ రివీల్ చేసింది కీర్తి. 

సినిమాల్లో నటించడమే కాకుండా తన శారీరక ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. అలాగే యోగా సైతం చాలా మార్పు తెచ్చినట్లు చెప్పుకొచ్చింది.