Ajith Kumar: అజిత్ సినిమాకు షాకిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్.. 5 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలంటూ నోటీసులు..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బాక్సాపీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లూ రాబడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ టీంకు షాకిచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. అంతేకాదు రూ.5 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా దూసుకుపోతుంది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదలై మంచి వసూళ్లు రాబడుతుంది. డైరెక్టర్ అజిత్ నటించిన ఈ చిత్రానికి మొదటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించగా.. ఇందులోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ క్రమంలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ టీంకు మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాకిచ్చారు. ఈ సినిమా ఇప్పుడు కాపీ రైట్ వివాదంలో చిక్కుకుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ పాత సినిమాల పాటలను సినిమాల్లో ఉపయోగించే ట్రెండ్‌ని ప్రారంభించిన తర్వాత, చాలా మంది ఈ ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. ఆ విషయంలో, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఓత రూపాయుమ్ తారే, ఎన్ జోడి మంగళ్ కురువి, ఇలామా ఇద్ ఇధ్, దొట్టు దొట్టు పెసుమ్ సుల్తానా పాటలు ఉపయోగించారు.
అయితే ఒత్త రూపయుమ్ తారే, ఎన్ జోడి మంజల్ కురువి, ఇలమై ఇదో ఇదో అనే మూడు పాటలను స్వరకర్త ఇళయరాజా స్వరపరిచారు. తన అనుమతి లేకుండా తన పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఉపయోగించారని ఆరోపిస్తూ, ఇళయరాజా నష్టపరిహారం కోరుతూ కోర్టులో దావా వేశారు. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, సినిమాలో ఉపయోగించిన పాటలను వెంటనే తొలగించాలని నోటీసులో డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లోపు పాటలను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు.
గతంలో మలయాలీ సూపర్ హిట్ మంజుమ్మెల్ బాయ్స్, కూలీ వంటి చిత్రాలకు సైతం ఇళయరాజా నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర నిర్మాతలకు సైతం నోటీసులు పంపించారు. ఇక ఇప్పుడు ఈ వివాదం ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :