Arundhati: అనుష్క ‘అరుంధతి’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా? గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు
టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన అరుంధతి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ దెబ్బతో సౌత్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అనుష్క. అయితే అనుష్క కంటే ముందు ఈ సినిమా ఇద్దరు స్టార్ హీరోయిన్ల దగ్గరకు వెళ్లిందట.

అనుష్క కెరీర్ లో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ ఉండచ్చు గాక.. కానీ అరుంధతి సినిమా మాత్రం స్వీటీ కెరీర్ లో చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమాకు ముందు అనుష్క జస్ట్ కేవలం గ్లామరస్ హీరోయిన్ పాత్రలే పోషించింది. నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ పెద్దగా చేయలేదు. అయితే 2009లో వచ్చిన అరుంధతి సినిమా అనుష్క కెరీర్ ను పూర్తిగా మలుపుతిప్పింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 13 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో జేజమ్మగా అనుష్క అభినయానికి అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాతనే టాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది స్వీటీ. అంతేకాదు బాహుబలి వంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల్లోనూ నటించే అవకాశం అనుష్కకు దక్కింది. అయితే ఈ సినిమాలో జేజమ్మ పాత్ర కోసం ముందుగా అనుష్కను అనుకోలేదట.
అరుంధతిలో జేజమ్మ పాత్ర కోసం ముందుగా మమతా మోహన్ దాస్ ను సంప్రదించారట మేకర్స్. కథ కూడా వినిపించారట. అయితే ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు అరుంధతి సినిమాను వదులుకుంది మమత. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.
మమతా మోహన్ దాస్ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఇక మమత తర్వాత కన్నడ హీరోయిన్ ప్రేమను సంప్రదించారట కోడి రామకృష్ణ. అప్పటికే వీరి కాంబోలో దేవి అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. అయితే అరుంధతి సినిమా కోసం ఆమెను సంప్రదించినప్పటికీ, అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉందట. దీంతో డేట్స్ కుదరక అరుంధతి అవకాశం వదులుకుందట. ‘కోడి రామకృష్ణ గారితో నాకు మంచి అనుబంధం ఉంది. దేవి సినిమా సమయంలో ఆయన నాకు తెలుగు కూడా నేర్పారు. అరుంధతి సినిమా కోసం ఆయన నా వద్దకు వచ్చినప్పుడు నేను కన్నడలో కొన్ని ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను. దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాను. అరుంధతి సినిమా విడుదలైన తర్వాత చూశాను, చాలా అద్భుతంగా ఉంది. కానీ అనుష్కకు ఈ అవకాశం దక్కినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ప్రేమ.
ప్రేమ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .








