Anasuya- Raasi: నటి రాశికి అనసూయ క్షమాపణలు.. ఆ డబుల్ మీనింగ్ డైలాగ్‌పై ఏమన్నదంటే?
ఓ కామెడీ స్కిట్ లో తన పేరు వచ్చేలా అనసూయ నోటి వెంట డబుల్ మీనింగ్ డైలాగ్ రావడంపై ఇటీవల రాశి స్పందించింది. యాంకర్ అనసూయతో పాటు జడ్జిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కామెడీ చెయ్యొచ్చు కానీ బాడీ షేమింగ్ చేయడానికి ఎవరికీ హక్కులేదంటూ మండి పడింది.

సుమారు మూడేళ్ల క్రితం.. ఒక టీవీ షోలో భాగంగా చేసిన స్కిట్‌లో అనసూయ నోటి నుంచి వచ్చిన ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వివాదాస్పదమైంది. అప్పట్లో ఈ డైలాగును పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.. కానీ.. ఈ మధ్యన శివాజీ వర్సెస్ అనసూయ గొడవల కారణంగా మళ్లీ ఈ డబుల్ మీనింగ్ డైలాగ్ నెట్టింట బాగా వైరలవుతోంది. ముఖ్యంగా ఇందులో సీనియర్ హీరోయిన్ రాశి గారు రావడంతో ఇటీవల ఆమె స్పందించింది. ‘ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ప్రశ్నించింది. రాశి కామెంట్స్ కు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు బాగా వైరలవుతోంది. దీంతో అనసూయ నటికి క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ పెట్టింది.
‘డియర్ రాశిగారు. . మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. మూడేళ్ల క్రితం నేను చేసిన ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరుని ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారు. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది నా పొరపాటే. నా క్షమాపణ అంగీకరించండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు దాన్ని సరిదిద్దలేను. మనుషులు మారుతుంటారు. ఆ షోలో డబుల్ మీనింగ్ మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని మార్పు మీరు గమనించొచ్చు’
‘ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ క్యాంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెబుతున్నాను. మహిళల శరీరాల గురించి కామెంట్ చేసేవారిని ప్రశ్నించే విషయంలో ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా బలంగా నిలబడ్డాను. ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా’ అని తన పోస్టులో రాసుకొచ్చింది అనసూయ. మరి దీనికి రాశి ఎలా స్పందిస్తుందో చూడాలి.
అనసూయ పోస్ట్..
@RaasiActress ma’am 🙏🏻 pic.twitter.com/DZLfUNp6rr
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 5, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




