New Income Tax Rules: దేశంలో ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా మారనున్న రూల్స్.. ప్రతీఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిందే
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి వస్తుంది. దీని వల్ల అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రజలందరూ కొత్త ఐటీ రూల్స్, నిబంధనల గురించి తెలుసుకోవాల్సిన అవసరముంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం ఎలా ఉంటుంది..? అనే వివరాల్లోకి వెళ్తే..

గత ఏడాది పార్లమెంట్‌లో కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం-2025ను ఉభయ సభల్లో ఆమోదించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా.. ఎప్పటినుంచి అమలు చేస్తామనేది కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రానున్న ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్ధికశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఫిబ్రవరి 1 తేదీన ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆ సారి పన్ను శ్లాబుల్లో ఏమైనా మార్పులు ఉంటాయా? అనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ తర్వాత ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న కొత్త ఐటీ చట్టం ఎలా ఉంటుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త ఐటీ చట్టంతో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొత్త మార్పులు ఇవే
-కొత్త ఐటీ చట్టం పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని పూర్తిగా డిజిటల్ రూపంలో తీసుకొచ్చారు -సామాన్యులకు అర్ధమయ్యే పరిభాషలో ఐటీ రూల్స్, నిబంధనలు ఉంటాయి. ఎవరైనా సులువుగా చదివి అర్థం చేసుకోవచ్చు -ఇక నుంచి రిటర్మ్స్ చాలా వేగవంతంగా అందుతాయి. ఐటీ చెల్లించేవారికి దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది -ఇక నుంచి పూర్తిగా పేపర్ లెస్ విధానంలో ఆదాయపు పన్ను ప్రక్రియ ఉంటుంది -పన్ను నోటీసులు తగ్గనుండగా.. రీఫండ్ ప్రాసెస్ వేగవంతంగా జరుగుతుంది -పన్ను దాఖలు చేయడం మరింత సులభతరం అవ్వనుంది -ఐటీ పన్ను వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవుతాయి -భయం లేని పన్ను వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తుంది -కొత్త ఐటీ చట్టంలోని రూల్స్ సంక్షిష్టమైన భాషలో ఉండటం వల్ల సామాన్యులకు అర్థం అయ్యేది కాదు.. కొత్త చట్టంలోని భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉంటుంది
1961 ఐటీ చట్టం
1961లో ఐటీ చట్టాన్ని చేశారు. 60 ఏళ్లకుపైగా సాగుతున్న ఆ చట్టంలో కాలానుగుణంగా చాలా మార్పులు చేశారు. వేలసార్లు వాటిని సవరించారు. ఇప్పుడు ఆ చట్టం స్థానంలో ఈ కొత్త ఐటీ చట్టం-2025ను ప్రవేశపెట్టారు. ఐటీ చట్టం వల్ల ఆర్ధిక వ్యవహారాల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే ట్యాక్స్‌లు చెల్లించేవారు కొత్త ఐటీ చట్టం గురించి తెలుసుకుని ఉండారు. ఈ మార్పుల గురించి ముందే అవగాహన కలిగి ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే కొత్త మార్పులు తెలుసుని ముందే జాగ్రత్త పడాలి. కొత్త ఐటీ చట్టంతో ట్యాక్సుల్లో పూర్తి పారదర్శకత వస్తుందని కేంద్రం చెబుతోంది.
