AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. సంక్రాంతికి కానుక అదిరిపోయింది.. పండుగ ఖర్చులు ఆదా

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్. ఏపీఎస్‌ఆర్టీసీ సంక్రాంతికి గతంలో ఎన్నడూ లేనంతగా భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను ప్రకటించింది. ఏకంగా 8వేలకుపైగా ప్రత్యేక బస్సులను తిప్పనుంది. ఇవి ఏయే ప్రాంతాల మధ్య తిరుగుతాయి.. ఛార్జీల వివరాలు ఎలా ఉన్నాయి..? ఇప్పుడు చూద్దాం

Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. సంక్రాంతికి కానుక అదిరిపోయింది.. పండుగ ఖర్చులు ఆదా
Apsrtc
Venkatrao Lella
|

Updated on: Jan 07, 2026 | 9:08 AM

Share

సంక్రాంతి వేళ ఇంటికెళ్లేవారికి ఏపీఎస్‌ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్ తెలిపింది. భారీ ఎత్తున ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు ఉండటంతో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ సారి భారీగా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో తక్కువ ధరలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లవచ్చు. ప్రత్యేక బస్సుల్లో గతంలో కాస్త అధిక చార్జీలు ఆర్టీసీ అధికారులు వసూలు చేసేవాళ్లు. కానీ ఈ సారి ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు పెంపు లేదు. సాధారణ ఛార్జీలే అమల్లో ఉంటాయని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ప్రభుత్వ సూచనతో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. ప్రైవేట్ బస్సుల్లో వెళ్లాలంటే వేలకు వేలు పెట్టాల్సి వస్తుంది. దీని వల్ల ప్రయాణ ఖర్చు ఎక్కువవుతుంది. అదే ఆర్టీసీ బస్సుల్లో తక్కువ ఛార్జీల ఉండటంతో ప్రయాణ ఖర్చులు ఆదా కానున్నాయి.

ఈ సారి 8,432 ప్రత్యేక బస్సులు

ఈ సారి సంక్రాంతికి ఏకంగా 8,432 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. వీటిల్లో 2,432 బస్సులను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి నడపనున్నారు. ఇక మిగతా 71 శాతం బస్సులను ఏపీలోని పట్టణాలు, గ్రామాల మధ్య తిప్పనుంది. సంక్రాంతి పండుగ ముందు రోజుల్లో 3,857 స్పెషల్ బస్సులను నడపనుండగా.. వీటిల్లో 3,500 బస్సులు ఏపీలోని వివిధ ప్రాంతాల మధ్య సర్వీసులు అందించనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌కు 240 ప్రత్యేక బస్సులు నడపనుండగా.. ఇక చెన్నైకు 15 స్పెషల్ బస్సులు తిప్పనున్నారు. అటు బెంగళూరుకు 102 బస్సులను తిప్పనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలు అమలు

ఏపీలో స్త్రీ శక్తి పేరుతో మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీన వల్ల ఇప్పటికే బస్సుల్లో రద్దీ పెరగ్గా.. పండక్కి రద్దీ మరింత పెరగనుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో పండక్కి ప్రత్యేక బస్సులను పెద్ద మొత్తంలో తిప్పనున్నారు. ఇక పండక్కి సొంతూళ్లకు వెళతారు గనుక పట్టణాలు, సిటీల నుంచి గ్రామాలకు కనెక్టివిటీ ఉండేలా ఎక్కువ బస్సులను తిప్పనున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే గ్రామాలు, పట్టణాలు, మండలాల మధ్య ఏకంగా 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ బస్సుల్లో ఎలాంటి అధిక ఛార్జీలు ఉండవని, సాధారణ ఛార్జీలే ఉంటాయని తెలిపారు. సాధారణంగా ప్రతీసారి స్పెషల్ బస్సుల్లో ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేవాళ్లు. ఈ సారి వాటిని అమలు చేయకోవడం ప్రయాణికులకు శుభవార్తగా చెప్పవచ్చు. ఇటు తెలంగాణ ఆర్టీసీ కూడా హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే తెలంగాణలోని వివిధ ప్రాంతాల మధ్య స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టింది.