Sakshi Vaidya : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారా.. ? రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇటీవలే ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై సైతం మంచి అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై హీరోయిన్ సాక్షి వైద్య స్పందించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. అయితే అంతకు ముందు ఈ మూవీలో హీరోయిన్ గా సాక్షి వైద్యను ఎంపిక చేసినట్లు ప్రచారం నడిచింది. కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించారని వార్తలు వచ్చాయి. ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత సాక్షి వైద్య వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి సినిమాలో నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సాక్షి వైద్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పుకోవడం పై స్పందించింది.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
సాక్షి వైద్య మాట్లాడుతూ.. “ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తీసేశారని వచ్చిన వార్తలు నిజం కాదు. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. ఆయన డేట్స్ చాలా రేర్ గా ఇచ్చేవాళ్లు. ఒకరోజు హరీశ్ శంకర్ గారు కాల్ చేసి డేట్స్ కావాలి. ఎల్లుండే షూటింగ్ అన్నారు. అప్పుడు నేను ఫ్యామిలీ ఎమర్జెన్సీ వల్ల వారం రోజులు అందుబాటులో లేను. దీంతో షూటింగ్ కు రాలేకపోయాను. అలా డేట్స్ ఇష్యూ వల్ల ఆ సినిమా మిస్ అయ్యాను. నా స్థానంలో వేరే వాళ్లను తీసుకున్నారు. నేను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేశాను. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారెతో సినిమా చేస్తున్నాను. ఈసారి పవన్ కళ్యాణ్ గారెతో ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోను” అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో పవన్ జోడిగా శ్రీలీల నటిస్తుంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
