Weather: ముంచుకొస్తున్న వాయుగుండం.! తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఇలా ఉంటుంది.. తాజా రిపోర్ట్ ఇదిగో
బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం.. ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందట. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉందా.? వాతావరణ శాఖ ఎలాంటి సూచనలు ఇచ్చింది.? ఆ వివరాలు ఏంటో తెలుసుకోవడానికి ఈ స్టోరీ చదవాల్సిందే. ఓ సారి లుక్కేయండి మరి.

తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రాత్రి సమయల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. వచ్చే రెండు రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంది. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మెగావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో పొగ మంచు ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది చదవండి: చక్రం డిజాస్టర్ తర్వాత ప్రభాస్ తనతో ఎలా ఉన్నాడంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్..
అదిలాబాద్, నిర్మల్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. కరీంనగర్, వరంగల్, జగిత్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబాబాద్, వికారాబాద్, జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు రాష్ట్రంలోని ఖమ్మం జిల్లలో అత్యధికంగా 16.4 డిగ్రీలు, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక ఏపీ విషయానికొస్తే.. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ తూర్పు హిందూ మహాసముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. గురువారం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. పశ్చిమ-వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాత ప్రాంతానికి మరో 24 గంటలలో కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 10, 11న రాయలసీమ, దక్షిణ, కోస్తాంధ్రలో మోస్తారు వర్షాలు కురుస్తాయంది. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడక్కడ పొగమంచు ఎక్కువగా కురిసే అవకాశముందని తెలిపింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 20.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది చదవండి: ‘నా వల్లే ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అయిందన్నారు..’ మా మధ్య దూరం అందుకే.!




