Rythu Bharosa: రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్.. అకౌంట్లోకి వచ్చేది అప్పుడే.. క్లారిటీ వచ్చేసింది
Telangana: రైతు భరోసా కోసం తెలంగాణలోని రైతులందరూ ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ స్టార్ట్ కావడంతో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. సంక్రాంతికల్లా డబ్బులుజమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. కాస్త ఆలస్యమయ్యే అవకాశముంది. ఈ క్రమంలో నిధులు ఎప్పుడు అందుతాయనే దానిపై క్లారిటీ వచ్చింది.

Rythu Bharosa Scheme: తెలంగాణలో యాసంగి సీజన్ సాగు జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని రైతులందరూ భావించారు. సంక్రాంతి కల్లా రైతు భరోసా నిధులు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. కానీ కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తోంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా అందలేదు. దీంతో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది.
ఈ నెలాఖరుల్లోగా డబ్బులు
రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతుల అకౌంట్లో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనేది చెప్పేశారు. జనవరి నెలాఖరుల్లోగా రైతు భరోసా ఇస్తామని తెలిపారు. యాచారం మండల కేంద్రంలో జరిగిన రైతు వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని అన్నారు. రైతులకు త్వరలో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేస్తామని, నీటి వినియోగం తక్కువా ఉండే కూరగాయల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఇందుకోసం ప్రయోగత్మకంగా మూడు గ్రామాల్లో కూరగాయల సాగు చేశారని, ఇది విజయవంతమైందని స్పష్టం చేశారు. రైతులందరూ ఈ విధానం పాటించాలని సూచించారు.
వారికి రైతు భరోసా కట్..?
కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమై రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని గతంలో సీఎం రేవంత్ పలుమార్లు ప్రకటించారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం అన్నీ భూములకు రైతు భరోసా ఇచ్చిందని, తమ ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నట్ల తెలిపారు. ఇందుకోసం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే ఆధారంగా పంట సాగు చేస్తున్న భూములను గుర్తించి వారికి మాత్రమే రైతు భరోసా అందించనున్నారు.
