AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పడుకునే ముందు యూట్యూబ్‌ చూసే అలవాటు ఉందా? ఈ ఛేంజ్‌తో మీ డబ్బు, డివైజ్‌ లైఫ్‌ ఆదా అవుతుంది!

కొంతమంది నిద్రపోయే ముందు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటారు, వాటివల్ల డేటా, డివైజ్ బ్యాటరీ వృథా అవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా యూట్యూబ్ 'స్లీప్ టైమర్' ఫీచర్‌ను విడుదల చేసింది. ఇది నిర్ణీత సమయం తర్వాత వీడియోలను ఆటోమేటిక్‌గా పాజ్ చేస్తుంది.

పడుకునే ముందు యూట్యూబ్‌ చూసే అలవాటు ఉందా? ఈ ఛేంజ్‌తో మీ డబ్బు, డివైజ్‌ లైఫ్‌ ఆదా అవుతుంది!
Youtube Sleep Timer
SN Pasha
|

Updated on: Jan 07, 2026 | 9:34 AM

Share

కొంతమందికి రాత్రి నిద్రపోయే ముందు యూట్యూబ్‌లో వీడియోలు చూసే అలవాటు ఉంటుంది. అలానే చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకుంటారు. ఆ వీడియోలు మాత్రం అలానే ప్లే అవుతూ ఉంటాయి. మరికొంత మంది పగటిపూట కూడా అదే పనిగా వీడియోలు చూస్తూ నిద్రపోతారు. ఇలా నిద్రలోకి జారుకున్న తర్వాత కూడా వీడియోలు ప్లే అవుతూ ఉంటాయి. వాటిని ఆపడం కుదరదు. మళ్లీ నిద్రలేచిన తర్వాత ఆఫ్‌ చేస్తుంటారు. మీ విషయంలో కూడా ఇలానే జరుగుతూ ఉంటే ఫీల్‌ అవ్వకండి. దానికో సొల్యూషన్‌ వచ్చేసింది.

మీ సమయాన్ని ఆదా చేసే ఓ ఫీచర్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు నిద్రపోయే ముందు దాన్ని సెట్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ తన గేమ్-ఛేంజర్ ఫీచర్, స్లీప్ టైమర్‌ను అక్టోబర్ 2024లో విడుదల చేసింది, నిద్రవేళకు ముందు వీడియో కంటెంట్‌ను చూడటానికి ఇష్టపడే వినియోగదారుల కోసం. Google యాజమాన్యంలోని యూట్యూబ్‌ నుండి వచ్చిన ఈ వినూత్న ఫీచర్ వినియోగదారులు నిర్దిష్ట వ్యవధి తర్వాత వారి వీడియో కంటెంట్‌ను పాజ్ చేయడానికి టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇది మీ పరికరం రాత్రంతా ఆన్‌లో ఉండకుండా చూస్తుంది. ప్రశాంతమైన సంగీతం, ధ్యానం లేదా ASMR వింటూ యూట్యూబ్‌ను నిద్ర సహాయంగా ఉపయోగించే వ్యక్తులకు ఈ ఫీచర్ ఉత్తమ యూట్యూబ్‌ ఫీచర్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ ఫీచర్‌తో మీ డేటా సేవ్‌ అవుతుంది. అంటే ఇన్‌డైరెక్ట్‌గా మీ డబ్బు ఆదా అవుతుంది. అలాగే డివైజ్‌ లైఫ్‌ కూడా సేవ్‌ అవుతుంది.

  • స్టెప్‌ 1: ముందుగా మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌లో యూట్యూబ్‌ యాప్‌ను తెరవండి.
  • స్టెప్‌ 2: దీని తర్వాత, స్లీప్ టైమర్ ఫీచర్‌ను ఉపయోగించడానికి, మీరు చూస్తున్న వీడియో ఎగువన ఉన్న మూడు-చుక్కల చిహ్నంపై క్లిక్ చేయండి.
  • స్టెప్‌ 3: కొత్త స్లీప్ టైమర్ సెలక్షన్‌ లిస్ట్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయండి.
  • స్టెప్‌ 6: తర్వాత మీరు 10 నిమిషాల నుండి 1 గంట వరకు, వీడియో ఎండ్‌ వరకు ఎంపికలను చూస్తారు.
  • స్టెప్‌ 7: మీరు 10 నిమిషాల తర్వాత వీడియోను ఆపివేయాలనుకుంటే, మీరు 10-నిమిషాల ఎంపికను ఎంచుకోవచ్చు.
  • స్టెప్‌ 8: సమయం ముగిసిన తర్వాత, వీడియో ఆటోమేటిక్‌గా పాజ్ అవుతుంది. మీ డివైజ్‌ స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి