Tollywood: 15 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. 100కు పైగా సినిమాలు.. 14 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..
ఒకప్పుడు తెలుగు సినీరంగంలో ఆమె తోపు హీరోయిన్. కేవలం 15 ఏళ్ల వయసులోనే కథానాయికగా మారి వెండితెరపై సత్తా చాటింది. 8 భాషలలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.

90’s లో తెలుగు చిత్రపరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సరసన నటించి అనేక హిట్స్ అందుకుంది. 15 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. సినిమాలు చేయకపోయినా రూ.2 వేల కోట్లకు యజమాని ఆమె. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించింది. ఇన్నాళ్లు ఫ్యామిలీ లీడ్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ రంభ. 1993లో రాజేంద్రప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో కథానాయికగా పరిచయమైంది.
ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలోనూ పలు సినిమాల్లో నటించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. అళగియ లైలా పాటతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. రంభ చివరిసారిగా పెన్ సింగం అనే సినిమాలో కనిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ సైతం చేసింది. 2010లో కెనడియన్ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్ ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇన్నాళ్లుతో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసిన రంభ.. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంది.
ఇక ఇప్పుడిప్పుడే తిరిగి ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతుంది. బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఇక ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది రంభ. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించనుందట రంభ. నివేదికల ప్రకారం రంభ ఆస్తులు రూ.2 వేల కోట్లు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..