Racha Ravi: నీ రుణం తీరదు.. కనీసం వడ్డిగానైనా ప్రేమిస్తాను.. రచ్చ రవి ఎమోషనల్..
ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో వరుస సినిమాలతో అలరిస్తున్న కమెడియన్లలో రచ్చ రవి ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన రవి.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు. తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు రచ్చ రవి. తీసుకోలేదా రెండు లక్షల కట్నం అనే డైలాగ్ ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన రచ్చ రవి.. ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్, నటనతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బలగం సినిమాలో ఆగుతావా రెండు నిమిషాలు అంటూ అతడు చెప్పిన డైలాగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ నటుడిగా మారుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
సినిమాలతో బిజీగా ఉన్న రచ్చ రవి.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశాడు. నిన్న తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలుపుతూ తనపై ఉన్న ప్రేమను బయటపెట్టారు. తన వివాహ ఫోటోలను షేర్ చేస్తూ.. “”నిన్ను పరిచయం చేసిన నీ… నా… తల్లిదండ్రుల రుణం తీరదు… నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ…. కాంప్రమైజ్ నువ్వు అవుతూ లైఫ్ లో నన్ను సక్సెస్ చేయిస్తూ….ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని… అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని…. నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని…నా సహచరి ఐ లవ్ యు స్వాతి…” అంటూ రాసుకొచ్చారు.
ప్రస్తుతం రచ్చ రవి చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. ఇది చూసిన అభిమానులు, సెలబ్రెటీలు నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రచ్చ రవి సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వకముందు కలెక్టర్ స్మిత సబర్వాల్ దగ్గర వర్క్ చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..