AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Auction: 10 ఓవర్లలో 120+ పరుగులు.. అత్యంత చెత్త రికార్డ్ సృష్టించిన రూ. 40 లక్షల చెన్నై బౌలర్

Chennai Super Kings Aman Khan Worst World Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దక్కించుకున్న యువ ఆల్‌రౌండర్ అమన్ ఖాన్, దేశవాళీ క్రికెట్‌లో ఒక అవాంఛనీయ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పుదుచ్చేరి కెప్టెన్‌గా ఉన్న అమన్ ఖాన్, బౌలింగ్‌లో ఏకంగా 123 పరుగులు సమర్పించుకుని లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు.

IPL 2026 Auction: 10 ఓవర్లలో 120+ పరుగులు.. అత్యంత చెత్త రికార్డ్ సృష్టించిన రూ. 40 లక్షల చెన్నై బౌలర్
Aman Khan Most Expensive Sp
Venkata Chari
|

Updated on: Dec 30, 2025 | 6:58 AM

Share

Most Expensive Spell: క్రికెట్ ఆటలో రికార్డులు సృష్టించడం సహజం, కానీ కొన్ని రికార్డులు ఆటగాళ్లకు చేదు జ్ఞాపకాలను మిగిలిస్తాయి. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులను షాక్‌కు గురిచేస్తూ ఆ జట్టు కొత్త ఆటగాడు అమన్ ఖాన్ అటువంటి ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అమన్ ఖాన్ బౌలింగ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు.

10 ఓవర్లలో 123 పరుగులు..

పుదుచ్చేరి జట్టుకు నాయకత్వం వహిస్తున్న అమన్ ఖాన్, జార్ఖండ్ బ్యాటర్ల ధాటికి బెంబేలెత్తిపోయాడు. తన కోటా 10 ఓవర్లలో ఏకంగా 123 పరుగులు ధారపోశాడు. ఇందులో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీనితో లిస్ట్-ఏ క్రికెట్ (50 ఓవర్ల ఫార్మాట్) చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అమన్ ఖాన్ నిలిచాడు. ఇంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మిబోమ్ మోసు (9 ఓవర్లలో 116 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అమన్ ఖాన్ అధిగమించాడు.

CSK వేలంలో రూ. 40 లక్షలకు కొనుగోలు..

ఇటీవల జరిగిన IPL 2026 మెగా వేలంలో అమన్ ఖాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల తరపున ఆడిన అనుభవం ఇతనికి ఉంది. ఫినిషర్‌గా, మంచి ఆల్‌రౌండర్‌గా పేరున్న అమన్‌పై ధోనీ సేన నమ్మకం ఉంచింది. అయితే సీజన్ ప్రారంభానికి ముందే ఇలాంటి ప్రదర్శన చేయడం సీఎస్‌కే అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో భారీ స్కోరు సాధించింది. జార్ఖండ్ ఆటగాడు అనుకుల్ రాయ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోగా, పుదుచ్చేరి జట్టు లక్ష్య ఛేదనలో 235 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా జార్ఖండ్ 133 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

అమన్ ఖాన్ తన తదుపరి మ్యాచ్‌లలో పుంజుకుని, తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడో లేదో వేచి చూడాలి. ఐపీఎల్ వంటి మెగా టోర్నీకి ముందు ఇలాంటి ప్రదర్శనలు ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నప్పటికీ, తన లోపాలను సరిదిద్దుకుని స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.