AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దురంధర్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న పాన్ ఇండియా స్టార్? సంక్రాంతికి సునామీ తప్పదా

బాక్సాఫీస్ వద్ద పాతిక రోజులపాటు ఒక సినిమా సునామి సృష్టించడం సాధారణం కాదు. అల్ట్రా స్టార్స్ సాధించలేని రికార్డులను ఒక హీరో అలవోకగా దాటేస్తున్నాడు. ఆదివారం కూడా భారీగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు 1100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఎవరికైనా ఉందా..

దురంధర్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న పాన్ ఇండియా స్టార్? సంక్రాంతికి సునామీ తప్పదా
Dhurandhar.
Nikhil
|

Updated on: Dec 30, 2025 | 6:00 AM

Share

సైలెంట్‌గా వచ్చి రికార్డులు తిరగరాస్తున్న సినిమా దురంధర్. ఈ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ తర్వాత ఆ ఆలోచన వదిలేశారు. పార్ట్ 2 మాత్రం మల్టీ లాంగ్వేజ్‌లో తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రం సెట్ చేసిన బెంచ్‌మార్క్‌ను బ్రేక్ చేయడం అంత సులభం కాదు. అయినా ఆ అవకాశం దగ్గరలో ఉన్న హీరోల్లో ముందు వినిపిస్తున్న పేరు ఒక్కటే. జనవరి 9న ఆ హీరో నటించిన సినిమా రిలీజ్ కాబోతోంది. ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయం. కానీ ఏ స్థాయి బ్లాక్‌బస్టర్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేం. సంక్రాంతి సీజన్‌లో బాలీవుడ్ నుంచి పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడం కూడా ప్లస్ పాయింట్.

దురంధర్ రికార్డుల ధర్నా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్‌తో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఫిమేల్ ఓరియెంటెడ్ స్త్రీ 2 ..  500 కోట్లు దాటినప్పుడు ఇదే హర్రర్ జానర్‌లో ప్రభాస్ సినిమా వస్తే రికార్డులు బద్దలవడం ఖాయం. భారీ టార్గెట్‌తో బరిలో దిగుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ఐదు రోజుల ముందే రిలీజ్ అవుతోంది. భారీ ఓపెనింగ్స్ నమోదు కాబోతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్ బేస్, హారర్ కామెడీ జానర్ కాంబినేషన్ ప్లస్‌లుగా మారనున్నాయి.

Rajasaab.

Rajasaab.

ఎవరు గెలుస్తారు?

సంక్రాంతి రేస్‌లో అరడజను సినిమాలు ఉన్నా రాజా సాబ్‌కు ప్రత్యేక ఫోకస్ ఉంది. సోలో రిలీజ్ వచ్చి ఉంటే కెజిఎఫ్, పుష్ప రేంజ్ హైప్ వచ్చేది. ఇప్పుడు ఆడియన్స్ తమ టేస్ట్ ప్రకారం విడిపోతారు. న్యూట్రల్ రివ్యూలు, పబ్లిక్ టాక్ ప్రధానం. అన్ని విభాగాల్ని మెప్పిస్తే దురంధర్ సింహాసనాన్ని లాక్కోవడం రాజా సాబ్‌కు సులభమే. కానీ ఆ స్థాయి బెంచ్‌మార్క్ బ్రేక్ చేయాలంటే ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్ కావాలి. ప్రభాస్ మేకర్స్ ఆ బాధ్యత తీసుకున్నారని తెలుస్తోంది. ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేశాయి.

రాజా సాబ్ జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది హీరోయిన్లు. ప్రభాస్ రెట్రో లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. దురంధర్ సృష్టించిన రికార్డుల సునామీని రాజా సాబ్ ఎంతవరకు బద్దలు కొడుతుందో రిలీజ్ తర్వాతే తేలనుంది. అయితే ప్రభాస్ మార్కెట్, సీజన్ అడ్వాంటేజ్ బాక్సాఫీస్ రికార్డులపై ఆశలు పెంచుతున్నాయి.

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?