ఆయనంటే అంత పిచ్చి.. అవసరమైతే చెయ్యి కోసుకుంటా : స్టార్ హీరోయిన్
చాలా మంది స్టార్ హీరోయిన్ సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది భామలు ఇప్పుడు అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది సహాయక పాత్రల్లో నటిస్తుంటే మరికొంతమంది మాత్రం వెబ్ సిరీస్ ల వైపు అడుగులేస్తున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు.

టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్ సత్తా చాటుతున్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె నటన అందం గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎలాంటి పాత్ర అయినా కూడా ఇట్టే ఒదిగిపోయి తన నటనతో ప్రేక్షకులను కవ్విస్తుంది ఈ అమ్మడు.అంతే కాదు తన నటనతో జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్ తో పాటు సెంట్ గా హిందీలోనూ నటించి ఆకట్టుకుంది. తాజాగా అమ్మడు చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన సినిమాలో నటించడానికి అవసరమైతే చెయ్యి కూడా కట్ చేసుకుంటా అని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆమె ఎవరు .? ఆయన ఎవరో చూద్దాం.!
అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్
పైన కనిపిస్తున్న టాలెంటడ్ బ్యూటీ ఎవరో కాదు తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి ప్రియమణి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక తెలుగులో పెళ్ళైన కొత్తలో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. పరుత్తి వీరన్ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న ఘనత కూడా ఈ ముద్దుగుమ్మ సొంతం. అటు వెండితెర, ఇటు బుల్లితెరపై దూసుకుపోతోన్న ప్రియమణి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
అప్పుడు నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. 100కోట్లు రెమ్యునరేషన్ అంటుకుంటున్న హీరో
ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంటోంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటించింది. ఇక ఈ అమ్మడు తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియమణి మాట్లాడుతూ.. దర్శకుడు మణిరత్నం అంటే తనకు చాలా ఇష్టం అని తెలిపింది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో రావన్ సినిమాలో నటించింది ప్రియమణి. ఆ సినిమాలో విక్రమ్ సోదరి పాత్రలో నటించింది. తాజగా మణిరత్నం గురించి మాట్లాడుతూ.. ‘మణి సార్ నుండి ఫోన్ రాగానే నేను ఆయన సినిమాలో నటించడానికి చేయి కోసుకుంటా అన్నట్టు సిద్ధంగా ఉంటాను. ఆయన సినిమాలో నటించడమే గొప్ప వరం.. అది నా అదృష్టం అని భావిస్తాను. ఆయన చేసిన సినిమాలు, ఆయనకు ఉన్న ఎక్స్‌పీరియన్స్ చూస్తే ఎలాగైనా ఆయన సినిమాలో నటించాలనే కోరిక పుడుతుంది. అది ఎలాంటి పాత్ర అయినా సరే ’’ అని చెప్పుకొచ్చింది ప్రియమణి. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి








