AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాటా.. బై బై.. ఇక సర్దుకోవడమే.. ఈవారం హౌస్ నుంచి బయకు వెళ్ళేది ఆమేనా..

బిగ్‌బాస్ హౌస్‌ ఎనిమిదో వారం నామినేషన్స్ ఓ రేంజ్ లో జరిగాయి. గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. అంతేకాదు నామినేషన్స్ పవర్ కూడా మాజీ కంటెస్టెంట్ల చేతికే అప్పగించాడు. ప్రియ, మర్యాద మనీష్, ఫ్లోరాషైనీ, దమ్ము శ్రీజ హౌస్‌లోకి వచ్చి నామినేషన్స్ చేపట్టారు.

టాటా.. బై బై.. ఇక సర్దుకోవడమే.. ఈవారం హౌస్ నుంచి బయకు వెళ్ళేది ఆమేనా..
Bigg Boss9
Rajeev Rayala
|

Updated on: Oct 29, 2025 | 9:08 AM

Share

బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త కొత్త ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ ను మరోసారి హౌస్ లోకి తీసుకు వచ్చారు.. హౌస్ లోకి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ లోపల ఉన్న హౌస్ మేట్స్ ను నామినేట్ చేశారు. ఈ క్రమంలో చాలా మాటల యుద్ధాలే జరిగాయి.. ముఖ్యంగా శ్రీజ, మాధురి మధ్య ఓ రేంజ్ లో రచ్చ జరిగింది. కేవలం మాధురితో గొడవ పెట్టుకోవడానికే శ్రీజ హౌస్ లోకి వచ్చినట్టు ఉంది. ఇక ఈ అమ్మడు హౌస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..ఇక శ్రీజ తర్వాత భరణి కూడా హౌస్ లోకి వచ్చాడు. భరణి మెయిన్ గేట్ నుంచి ఇలా ఎంటర్ అవ్వగానే దివ్య పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుంది. దీంతో భరణి అయ్యో అంటూ కాస్త ఇబ్బంది పడ్డాడు. భుజం బానే ఉందా.. అని అడిగితే బానే ఉంది.. అని బదులిచ్చాడు. ఇమ్మానుయేల్‌ని హత్తుకొని కట్టప్ప.. చంపేశావ్ కదా అమరేంద్ర బాహుబలిని.. మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్ప.. చలో గుడ్ గేమ్ ఇమ్మానుయేల్ వెరీ గుడ్ గేమ్.. అని భరణి అన్నారు.

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

భరణి వచ్చి సంజన గారు మిమ్మల్నే నేను నామినేట్ చేస్తున్నాను.. మీరు రూల్స్ మాట్లాడతారు కానీ మీరే బ్రేక్ చేస్తారు అని భరణి సంజనను నామినేట్ చేశాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆతర్వాత దివ్యకు కాకుండా నిఖిల్ కు కత్తి ఇచ్చాడు భరణి. భరణి వెళ్లగానే కిచెన్‌లో దివ్య ఏడుపు స్టార్ట్ చేసింది..ఇమ్మూ ఓదార్చాడు. నెక్స్ట్ డే హౌస్‌లోకి భరణి-శ్రీజ రీఎంట్రీ ఇచ్చారు. భరణి, శ్రీజ హౌస్ లోకి రావడంతో హౌస్ మేట్స్ మధ్య పెద్ద చర్చే జరిగింది.

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

ఎనిమిదో వారం నామినేషన్స్ లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నిలిచారు. కళ్యాణ్, రాము, డీమాన్ పవన్, గౌరవ్, సంజన, తనూజ, మాధురి, రీతూ చౌదరి ఈ లిస్ట్ లో నిలిచారు. వీరిలో అందరికి ఎంతో కొంత బయట ఫ్యాన్ బేస్ ఉంది. కానీ గౌరవ్, మాధురీలకు మాత్రం అంతగా ఆదరణ లేదు. అయితే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం కూడా తనూజ టాప్ లో దూసుకుపోతుంది. ఇక డిమాన్ పవన్, రీతూ చౌదరి లాస్ట్ లో ఉన్నారు. అలాగే మాధురి కూడా ఓటింగ్‌లో లాస్ట్ లో ఉంది.. ఈ ముగ్గురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో ఈ ముగ్గురి నుంచి ఒకరు బయటకు వచ్చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.