పవర్ స్టార్‌తో ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు అతను
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నరు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ఇప్పటికే రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మొన్నామధ్య హరిహరవీరుమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో.. రాజకీయాలతోనూ బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే రెండు సినిమాలు చేసి మెప్పించారు. హరిహరవీరమల్లు సినిమాతోపాటు ఓజీ సినిమా కూడా చేశారు. వీటిలో ఓజీ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాసుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 300కొట్లోకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పాత ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పై ఫొటోలో పవన్ కల్యాణ్ పక్కన ఉన్న దెవరో గుర్తు పట్టారా.? మీసాలు లేకుండా క్లీన్ షేవ్ తో మెడలో కండువా వేసుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని పోజులిస్తున్నది ఓ టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం సృయంకృషిని నమ్ముకుని పైకొచ్చిన వారిలో ఇతను కూడా ఒకడు. అయితే ఇండస్ట్రీలోకి రాక ముందు ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొన్నాడాయన. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీతో మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన హుషారైన స్టెప్పులతో స్టార్ హీరోలకు ఫేవరెట్ కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు. ముఖ్యంగా మెగా హీరోలు ఇతనితో ఎక్కువగా సినిమాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన అతను మరెవరో కాదు జానీ మాస్టర్.
2009 నితిన్ ద్రోణ సినిమాతో డ్యాన్స్‌మాస్టర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జానీ మాస్టర్. ఆ తర్వాత రామ్ చరణ్‌తో రచ్చ, నాయక్, ఎవడు, రంగస్థలం, అల్లు అర్జున్‌తో జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠ పురంలో, యంగ్ టైగర్‌తో ఎన్టీఆర్‌తో బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో అరవింద సమేత వీర రాఘవ, రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు. తమిళంలో విజయ్, కన్నడలో సుదీప్, బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ తదితర స్టార్ హీరోలతోనూ వర్క్ చేసిన ఘనత జానీ మాస్టర్ సొంతం. పవన్ ను అమితంగా అభిమానించే ఆయన ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన తరఫున ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు జానీ మాస్టర్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








