రవితేజ, ప్రభాస్‌లతో హిట్స్.. ఆఫర్స్ తగ్గడంతో నటనకు గుడ్ బై చెప్పనుందా.?
పాన్ ఇండియా లెవల్లో ఆమె స్టార్ హీరోయిన్. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఒక్కో సినిమాకు రూ.11 కోట్లకు పైగా రెమ్యురనేషన్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరంటే..

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కొన్నాళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసినా కూడా ఈ అమ్మడికి అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని టాక్ వినిపిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ తాప్సీ. ఒకప్పుడు తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్కడ వరుసగా సినిమాలు చేసింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. కేవలం గ్లామర్ తోనే కాదు నటనతోనూ మెప్పించింది ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే తాప్సీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని బీ టౌన్‌లో టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియదు కానీ బాలీవుడ్ లో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గాంధారీ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా తప్ప మరో సినిమా అనౌన్స్ చేయలేదు తాప్సీ. అలాగే ఎక్కడా కూడా పెద్దగా కనిపించడం లేదు.. సోషల్ మీడియాలోనూ పెద్దగా హడావిడి చేయడం లేదు. దాంతో తాప్సీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీని పై తాప్సీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి








