- Telugu News Photo Gallery Cinema photos Rashmika shared photos from the film Thamma with the caption, Sweet memories
మధుర జ్ఞాపకాలు అంటూ.. ఆ ఫొటోస్ షేర్ చేసిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంటుంది. అంతే కాకుండా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ వరసగా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉంటుంది. కాగా, రీసెంట్‌గా థామా చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. దానికి సంబంధించిన ఫొటోస్ ఏవో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: Oct 25, 2025 | 4:48 PM

రష్మిక తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంటుంది. ఈ బ్యూటీ వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుటుంది. కథల విషయంలో ఆచీ తూచి అడుగులు వేస్తూ, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంది.

ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ అమ్మడు, అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిదం మూవీలో నటించి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా, తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

దీంతో తర్వాత వరసగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు అందుకుంటూ, స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. అంతే కాకుండా రీసెంట్‌గా థామా చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చి, మంచి హిట్ అందుకుంది.

గీతా గోవిదం, సరైనోడు , పుష్ప, పుష్ప2, ఛావా, యానిమల్, ఇలా వరసగా సినిమాలు చేస్తూ, వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని, స్టార్ హీరోయిన్‌గా మంచి వరస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇక తాజాగా ఈ చిన్నది ఆయుష్మాన్ ఖురాన సరసన, థామా చిత్రంలోనటించింది.

అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా, ఢిల్లీ పర్యాటనకు వెళ్లిన ఈ చిన్నది, మధుర జ్ఞాపకాలు అంటూ పలు ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ చిన్నదాని అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వా్ల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



