దుబాయ్‌లో ఓజీ నటి.. తలపై పాగాతో ఎంత క్యూట్ ఉందో..
అందాల ముద్దుగుమ్మ బ్యూటీ ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వరస సినిమాలతో దూసుకెళ్తుంది. తాజాగా ఈ బ్యూటీ, తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది. తాజాగా ఈ బ్యూటీ, దుబాయ్‌లో రచ్చ చేసింది. కాగా, తాజాగా దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతాయి.
Updated on: Oct 25, 2025 | 6:04 PM

బ్యూటీ ప్రియాంక మోహన్ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ చిన్నది తన క్యూట్‌నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా తన నటన, అందంతో అందరినీ మాయ చేసి, మంచి ఫ్యాన్ బేస్ పెంచుకుంటుంది.

ఈ అమ్మడు 2019లో కన్నడ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది, అదే సంవత్సరంలో నాని సరసన గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన అందం, నటనతో ఆకట్టుకుంది.

అయితే ఫస్ట్ మూవీ అంతగా హిట్ అవ్వకపోయినప్పటికీ, ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. తర్వాత శ్రీకారం సినిమాతో తన లక్కు పరీక్షించుకుంది. ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ కూడా అంతగా హిట్ అందుకోలేకపోయాయి.

దీంతో ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో అని తన ఫ్యాన్స్ అయోమయంలోపడిపోయారు. కానీ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఓ మలుపు తిరిగిపోయింది. ఈ మూవీ తర్వాత ఈ చిన్నదానికి వరసగా ఆఫర్స్ వస్తున్నట్లు టాక్.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా ఇన్ స్టాలో దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో చక్కగా తలపైన పాగా వేసుకొని, చాలా అందంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్అవుతున్నాయి.



