అప్పుడు నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. 100కోట్లు రెమ్యునరేషన్ అంటుకుంటున్న హీరో
సినిమా ఇండస్ట్రీలో అతను ఒక స్టార్ హీరో.. వందల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్న స్టార్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అలాగే ఆయన ఆస్తులు కొన్ని వేల కోట్లు.. గతంలో నెలకు కేవలం రూ. 1000 మాత్రమే జీతం అందుకున్న ఆ హీరో ఎవరో తెలుసా.?

దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ సినిమాలను ఎంచుకుంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. రెండుసార్లు పెళ్లి చేసుకుని.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు 60ఏళ్ల వయసులో మూడో ప్రియురాలిని పరిచయం చేశాడు. సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తలలో నిలుస్తున్నాడు ఈ హీరో. అంతే కాదు మొదటి రెమ్యునరేషన్ 1000 రూపాయిలు అందుకున్న ఆ హీరో.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్.. ఆయన సినిమాలు వందల కోట్లు రాబడుతున్నాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ఈ హీరో మరెవరో కాదండి..
ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే
ఆ తర్వాత మొదటి సినిమాకు రూ. వెయ్యి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్నాడు.. ఇప్పుడు వందల కోట్లు అందుకుంటున్న హీరో.. అతను ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. 1973లో విడుదలైన ‘యాదో కీ భారత్’ చిత్రంలో ఆయన బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. అతను 90లలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ
అయితే అమీర్ ఖాన్ హీరోగా మొదటి సినిమా యామత్ సే ఖయామత్ తక్. ఈ సినిమాకు అమీర్ కజిన్ మన్సూర్ ఖాన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ జూహీ చావ్లా నటించింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో అమీర్, జూహీ చావ్లా ఇద్దరూ స్టార్స్ అయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో అమీర్ మాట్లాడుతూ.. ఆ సినిమాకు ఆమీర్‌కు నెలకు కేవలం రూ.1000 శాలరీ మాత్రమే ఇచ్చారట. దాదాపు 11 నెలల పాటు షూటింగ్ జరిగింది. దాంతో రూ. 11000 అందుకున్నా అని తెలిపారు అమీర్. కాగా నివేదికల ప్రకారం అమిర్ ఖాన్ ఆస్తులు రూ.1862 కోట్లు. సినిమాలే బ్రాండ్స్ ప్రమోట్ చేయడం.. సినిమాల్లో నటించడంతోపాటు.. నిర్మాతగానూ డబ్బులు సంపాదిస్తున్నారు. అమీర్ ఖాన్ కు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. ‘అతనికి బెవర్లీ హిల్స్ మాన్షన్‌లో 75 కోట్ల రూపాయల విలువైన ఇల్లు ఉంది. బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఆయనకు దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన ఫామ్‌హౌస్ కూడా ఉంది. ఆమిర్ ఖాన్ దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్, BMW వంటి కార్లు ఉన్నాయి.
ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.








